Nivetha Pethuraj: బ్యాడ్మింటన్‌లో కప్పు కొట్టిన హీరోయిన్..మరొక గేమ్లోను ఎక్స్‌పర్టే!

Nivetha Pethuraj: బ్యాడ్మింటన్‌లో కప్పు కొట్టిన హీరోయిన్..మరొక గేమ్లోను ఎక్స్‌పర్టే!

సినీ సెలబ్రిటీల్లో చాలా మంది మల్టీ టాలెంటెడ్గా రాణిస్తున్నారు. కొంతమంది సినిమాల్లోనే కాకుండా గేమ్స్లో కూడా స్టార్స్ అవుతున్నారు. ఇప్పటికీ చాలా మంది స్టార్స్..స్టేట్, నేషనల్ లెవల్లో తమ ఫ్యాషన్ని ప్రూవ్ చేసుకోవడానికి..పలు గేమ్స్లో పాల్గొని పథకాలు సాధించి..ఎంతో మందికి ఆదర్శమవుతున్నారు.  

రీసెంట్గా సీనియర్ నటి ప్రగతి పవర్ల్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ 2024 లో పాల్గొని సిల్వర్ పథకాన్ని సాధించారు. 47 ఏళ్ళ వయసులో ఎంతో కష్టపడి సౌత్ ఇండియన్ ఛాంపియన్గా నిలవడంతో..ఆమెకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. 

లేటెస్ట్గా టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) బ్యాడ్మింటన్ గేమ్లో అదరగొడుతున్నారు. తమిళనాడులో జరిగిన స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ టోర్నీలో మధురై తరపున మిక్స్డ్ డబుల్స్లో ఆడి టైటిల్ సాధించారు. తనకి వచ్చిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ కప్తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో నివేదా షేర్ చేయడంతో..ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటుంది. బెస్ట్ కోచ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో తన సంతోషాన్పి పంచుకుంది. ఇక వాట్ నెక్ట్స్? అంటూ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు..నివేదా కార్ రేసింగ్ లోను మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంది. తాను ప్రొఫెషనల్ F1 కార్ రేసర్ కూడా. ఇప్పటికే ఫార్ములా కార్ రేసింగ్లో పలు మెడల్స్ కూడా సాధించింది. మరి నివేదాలో ఇంకెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయో మరి.

నివేదా పేతురాజ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో శ్రీ విష్ణు తో హీరోగా తెరకెక్కిన మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది.ఇక ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అలవైకుంఠపురంలో, చిత్రలహరి  దాస్ కా ధమ్కీ వంటి మూవీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.