Priyanka Arul Mohan: OG హీరోయిన్ స్టేజ్పై క్యూట్ స్టెప్పులు..ఫ్యాన్స్ ఊరుకుంటారా!

Priyanka Arul Mohan: OG హీరోయిన్ స్టేజ్పై క్యూట్ స్టెప్పులు..ఫ్యాన్స్ ఊరుకుంటారా!

తమిళ పరిశ్రమలో ఎంతో కాలంగా సినిమాలు చేస్తున్నా ప్రియాంక అరుల్​మోహన్ (Priyanka Arul Mohan)​కు సరైన గుర్తింపు దక్కలేదు. దీంతో టాలీవుడ్ వైపు అడుగులేసి నాని  గ్యాంగ్ లీడర్ మూవీలో నటించిన అంత ఫేమ్ కాలేదు. ఇక ఓజీ (OG) మూవీలో ఈ బ్యూటీని అనౌన్స్​చేయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకుంది. ఇప్పుడు టాలీవుడ్లో బిజీ బిజీగా మారింది. దీంతో ప్రియాంకా ఎక్కడికెళ్లినా..ఏం చేసిన క్షణాల్లో ఇట్టే వైరల్ అవుతోంది. 

సూపర్ క్రేజ్ ఉన్న ఈ భామ లేటెస్ట్గా తమిళ ఫిల్మ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్నది. ఈ షోలో మరో వర్సటైల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌జే సూర్య (SJ Suryah) కూడా అటెండ్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి ధనుష్‌ ఫేవరెట్‌ ట్రాక్‌కు సింపుల్‌గా డ్యాన్స్‌ చేసి..క్యూట్ ఎక్సప్రెషన్స్తో ఆడియన్స్ను ఇంప్రెస్ చేశారు.  దీంతో OG హీరోయిన్ స్టేజ్పై క్యూట్ స్టెప్పులేస్తే..పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..ఈ వీడియోను సోషల్ మీడియాలో ట్రేండింగ్ చేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ ఓజీ, నాని సరిపోదా శనివారం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలతో హిట్ కొడితే..ప్రియాంక ఇండస్ట్రీ టాక్ అఫ్ ది టౌన్ గా మారటం కన్ఫర్మ్. ప్రస్తుతం ఈ బ్యూటీ  విజయ్ దళపతి 68 మూవీ The Greatest of All Time (ది GOAT) లో నటిస్తుంది. దీంతోపాటు ధనుష్ కెప్టెన్‌ మిల్లర్‌లో కీలక పాత్రలో నటిస్తోంది.