Shruti Marathe: దేవరలో నా పాత్ర చాలా ప్రత్యేకం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శృతి

Shruti Marathe: దేవరలో నా పాత్ర చాలా ప్రత్యేకం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శృతి

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) చేస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ శివ కొరటాల(Shiva Koratala) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor), మరాఠి బ్యూటీ శృతి మరాఠే(Shruti Marathe) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువసుధా క్రియేషన్స్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్ లో ఎన్టీఆర్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. 

ఇదిలా ఉంటే.. దేవర సినిమా గురించి ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటిస్తున్న శృతి మరాఠే ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దేవర సినిమా గురించి మాట్లాడుతూ.. నేను దేవర సినిమాలో నటిస్తున్న విషయం అధికారిక ప్రకటన రాకముందే సోషల్ మీడియాలో వచ్చేసింది. అవును.. దేవరలో నేను ఎన్టీఆర్ భార్యగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నా పాత్ర చాలా ప్రత్యేకం కానుంది. అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. అక్టోబర్ 10న రానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా ఎదురుచూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తో పనిచేయడం అనేది నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చారు శృతి. ప్రస్తుతం దేవరపై ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక దేవర విషయానికి వస్తే.. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమా కూడా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఎర్ర సముద్రం బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ ఫీస్ట్ పీక్స్ లో ఉండనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించనున్న సంగీతం ప్రధాన ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య థియేటర్స్ కి రానున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.