
నటి తాప్సి(Taapsee) సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టార్ హీరోలపై, వాళ్ళ సినిమాలపై ఫైర్ అయ్యారు. అందరికీ స్టార్స్ కావాలంటే చిన్న సినిమాల గతేంటి అని ప్రశ్నించారు.
ఆసలు విషయం ఏంటంటే.. చాలా కాలంగా తాసి టాలీవుడ్ కు దూరంగా ఉంటున్నారు. ఆమె చివరగా తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. అందుకే ఆమె బాలీవుడ్ కు పరిమితం అయ్యారు. ఇటీవల నిర్మాతగా కూడా మారారు ఆమె. ఆమె నిర్మించిన లేటెస్ట్ మూవీ వీక్ థక్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు నెగిటీవ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఫ్లాప్ లిస్టులోకి చేరిపోయింది ఈ సినిమా. ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టార్ ఇండస్ట్రీతో సంబంధంలేకుండా స్టార్ హీరోలను టార్గెట్ చేసింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలన్నీ స్టార్ల చుట్టూనే తిరుగుతున్నాయి. వారికి మాత్రమే ఇక్కడ గుర్తింపు ఉంది. ఇది ఓటీటీకి కూడా పాకింది. దీంతో.. స్టార్స్ లేని సినిమాలకు ఆదరణ తగ్గింది. అలాంటి చిన్న సినిమాలా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. స్టార్లు లేని సినిమాలను ఓటీటీల్లోకి నెట్టేస్తున్నారు. అది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు.. అంటూ తన భాదను వ్యక్తపరిచారు తాప్సి. ప్రస్తుతం తాప్సి చేసిన ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆమె ప్రశ్నలకు ఇండస్ట్రీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.