అక్టోబర్ 15న ‘హాయ్ నాన్న’ మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

అక్టోబర్ 15న ‘హాయ్ నాన్న’ మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ మూవీ టీజర్‌‌‌‌ను కూడా దసరా కానుకగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్‌‌‌‌ను అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నట్టు గురువారం అనౌన్స్ చేశారు. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ రెండు పాటలతో సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

ఇప్పుడు  టీజర్‌‌‌‌తో మరింత ఆసక్తిని పెంచుతామంటున్నారు. ఇందులో తండ్రి పాత్రలో నటిస్తున్న నానికి.. కూతురుగా బేబీ కియారా ఖన్నా కనిపించనుంది. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.