హైదరాబాద్లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ

హైదరాబాద్లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ

హైదరాబాద్లో కేవలం 59 రూపాయలకే చికెన్ బిర్యానీ తినొచ్చు.  ఔను..  ‘కాకా 55’ బిర్యానీ పాయింట్లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ లభిస్తోంది. కాస్ట్ తక్కువ ఉన్నా.. రుచి సూపర్గా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇంత తక్కువ ధరకు బిర్యానీ లభించడం హైదరాబాద్లోనే ఫస్ట్ టైం. కొవిడ్ వల్ల ఆర్థికంగా ప్రజలు చితికిపోయారని.. అటువంటి వారికోసం తక్కువ ధరలో బిర్యానీ పెడితే బాగుంటందనే ఉద్ధేశంతో 55 రూపాయల బిర్యానీ స్టార్ట్ చేశామని షాప్ ఓనర్ నాని చెప్పారు. మధ్యతరగతి వాళ్లను దృష్టిలో పెట్టుకుని దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. 

కూకట్ పల్లి బీజేపీ ఆఫీస్ సమీపంలో చిన్న రూంలో కేవలం రూ.7500 పెట్టుబడితో దీనిని స్టార్ట్ చేశామని నాని చెప్పారు. తక్కువ ధర పెట్టినప్పుడు కస్టమర్స్కు ఎలా రీచ్ అవుతుందో అనే భయం ఉండేదని.. కానీ కస్టమర్లు ఇష్టంగా తినడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రస్తుతం 3 ఓన్ ఔట్లెట్లు, 9 ఫ్రాంచైజీలు ఉన్నాయని పేర్కొన్నారు. కాకినాడ, శ్రీకాకుళం, నాగర్ కర్నూల్, వైజాగ్ సహా పలు ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు ఉన్నట్లు చెప్పారు.

ప్రస్తుతం మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల బిర్యానీ ధర 4 రూపాయలు పెంచామని నాని తెలిపారు. మధ్యాహ్నం12 నుంచి రాత్రి 12వరకు షాప్ తెరిచి ఉంటుందన్నారు. తమ వద్ద ఫ్రై బిర్యానీ, లాలిపప్ బిర్యానీ,స్పెషల్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ అందుబాటులో ఉంటాయన్నారు. రోజుకు సుమారు 700 ప్లేట్స్ సేల్ అవుతాయని చెప్పారు. ఒక్కో బిర్యానీ పై కేవలం 17 రూపాయలు మిగులుతాయని వివరించారు. ఆసక్తి ఉన్నవారికి ఫ్రాంఛైజీ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.