AP Election 2026: రాజంపేటలో హైటెన్షన్... వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి ఇంటిపై.. టీడీపీ కార్యకర్తల దాడి.. 

AP Election 2026: రాజంపేటలో హైటెన్షన్... వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి ఇంటిపై.. టీడీపీ కార్యకర్తల దాడి.. 

ఏపీలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుండే రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. శనివారం ( అక్టోబర్ 17 ) రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి హరినాథ్ రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.

రాజంపేట వైసీపీ ఆఫీసుతో పాటు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి కిటికీ అద్దాలు, ఫర్నిచర్, కారు ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. ఇంత విధ్వంసం జరుగుతున్నా పోలీసులు వేడుక చూస్తూ ఉరుకున్నారని మండిపడుతున్నారు మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం తమపై దాడులు చేయిస్తుందని అంటున్నారు వైసీపీ నేతలు. 

ఇదిలా ఉండగా.. వైసీపీ అధినేత జగన్ ఇలాఖా పులివెందులలో కూడా వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు భగ్గుమన్నాయి. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను టీడీపీ శ్రేణులు కవ్వించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో రంగంలోకి దిగి 6 రౌండ్ల కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.