Surya kumar Yadav:బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ కొత్త రికార్డు

Surya kumar Yadav:బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ కొత్త రికార్డు

టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా (స్కై ఈజ్ లిమిట్) రెచ్చిపోతున్నాడు. తక్కువ టైంలోనే వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాట్స్ మెన్ గా ఎదిగిన సూర్య, సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నాడు. 360 డిగ్రీల్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న సూర్య, ఫీల్డ్ లోనూ అంతే చురుకుగా ఉంటాడు. గ్రౌండ్ ని 360 డిగ్రీల్లో కవర్ చేస్తూ ఫీల్డింగ్ చేస్తాడు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఫీల్డింగ్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

టీ20 మ్యాచ్ ల్లో ఒక ఏడాదిలో ఎక్కువ క్యాచ్ లు పట్టిన ఫీల్డగా తన పేరిట ఈ రికార్డ్ నమోదయింది. 2022లో టీ20ల్లో ఎక్కువ క్యాచ్ లు (17) అందుకున్నాడు. ఇప్పటివరకు ఆ రికార్డ్ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని తరుపున ఉండేది. ధోని 2016లో అత్యధికంగా 16 క్యాచ్ లు అందుకొని రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ రికార్డ్ ని దినేష్ కార్తిక్ 2022లో 16 క్యాచ్ లు పట్టి సమం చేశాడు. ఇప్పడు అదే రికార్డ్ ని సూర్య 17 క్యాచ్ లు పట్టి తిరగరాశాడు.