
తెలుగు..తమిళ..బాలీవుడ్..ఇలా ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన మూవీస్ కలెక్షన్స్..యాక్టర్స్ రెమ్యునరేషన్స్ గురించి వింటూ ఉంటాం. ఫలనా హీరో రెమ్యునరేషన్ ఎంత? ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరు అందుకుంటున్నారు? ఇలా ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలని ట్రై చేస్తుంటాం.
మరి టీవీ నటుల్లో ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు? ఒక్క ఎపిసోడ్ కోసం ఎంత కలెక్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. అయితే టెలివిజన్ నటీమణుల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది రూపాలీ గంగూలీ (Rupali Ganguly). ఈమే ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.
హిందీలో టాప్ సీరియల్‌గా 2020 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్నది అనుపమ(Anupama Serial). ఈ సీరియల్లో రూపాలీ గంగూలీ ఒక్కో ఎపిసోడ్ కి గాను రూ.3 లక్షల కలెక్ట్ చేస్తుందట. ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదే కావడం విశేషం. ఈమె 2000వ సంవత్సరంలో వచ్చిన సుకన్య అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ అయిన అనిల్ గంగూలీ కూతురే ఈ రూపాలీ గంగూలీ.
మరి టీవీ నటుడ్ని చూసుకుంటే..అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది కమెడియన్ కపిల్ శర్మ. ఇతను ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు రూ.50 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు..కపిల్ ఓవరాల్‌గా ఇండియాలోనే టాప్ టెలివిజన్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు.