2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను : హిల్లరీ

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను : హిల్లరీ

న్యూయార్క్ : 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తాను ఉండనని క్లారిటీ ఇచ్చారు డెమక్రాటిక్ నాయకురాలు, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, సెనేటర్ హిల్లరీ క్లింటన్. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన హిల్లరీ.. మరోసారి తాను అధ్యక్ష పదవి రేసులో ఉండనని .. న్యూయార్క్ టీవీ స్టేషన్ న్యూస్ 12కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రధాన పదవికి పోటీలో లేకపోయినప్పటికీ… తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం కొనసాగిస్తానని చెప్పారు హిల్లరీ. తమ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి నామినేట్ కావాలనుకుంటున్నవారితో ఇప్పటికే మాట్లాడానని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడం లేదని.. వాటిపై పోరాడాల్సి ఉందని ఆమె అన్నారు.