చిరంజీవి 158: ఫస్ట్ హాఫ్ లాక్.. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!

చిరంజీవి 158: ఫస్ట్ హాఫ్ లాక్.. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!

చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో  కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై వెంకట్ కె. నారాయణ  ఓ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 రోజులు పూర్తి చేసుకుంది. తక్కువ సమయంలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్టు మేకర్స్ తెలియజేశారు. దీంతో  ఫస్ట్ హాఫ్ దాదాపు లాక్ అయిందని, ఇప్పటివరకు తీసిన అవుట్‌‌‌‌పుట్ చాలాబాగా వచ్చిందని అన్నారు.  ఇటీవల షూట్ చేసిన ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు ప్రధాన హైలైట్‌‌‌‌గా నిలవనుందని  చెప్పారు.

ఇదే స్పీడ్‌‌‌‌తో షూటింగ్‌‌‌‌ను కొనసాగించి వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు.  మరోవైపు ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రెడీ చేస్తున్నట్టు అప్‌‌‌‌డేట్ ఇచ్చారు.  చిరంజీవి నటిస్తున్న  158వ చిత్రమిది.  అనస్వర రాజన్‌‌‌‌,  నివేదా పేతురాజ్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌‌‌‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషనల్ స్క్రీన్‌‌‌‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు డైలాగ్స్ రాస్తున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత  చిరంజీవి, బాబీ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.