సెర్బియా ఎన్నికల్లో విద్యార్థుల చరిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల వూచిక్ పాలనకు బ్రేక్!

సెర్బియా ఎన్నికల్లో విద్యార్థుల చరిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల వూచిక్ పాలనకు బ్రేక్!

సెర్బియా చరిత్రలో చారిత్రక ఘట్టం..  అక్టోబర్ 25, 2026న జరిగిన సెర్బియా సార్వత్రిక ఎన్నికల్లో సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థుల నేతృత్వంలోని కూటమి  స్టూడెంట్ లిస్ట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గత 14 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న సెర్బియా నియంతృత్వ నేత ట్రంప్ , పుతిన్‌లకు సన్నిహితుడైన అలెగ్జాండర్ వుసిచ్, చారిత్రాత్మక పార్లమెంటరీ ఎన్నికలలో తన ఓటమిని అధికారికంగా అంగీకరించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. 

వూచిక్ ఓటమి అంగీకారం..

పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే ప్రాథమిక ఫలితాల ఆధారంగా వూచిక్ తన ఓటమిని స్పష్టంగా అంగీకరించారు. 250 సీట్లున్న సెర్బియా పార్లమెంట్‌లో  135 నుంచి 140 సీట్లతో స్టూడెంట్ లిస్ట్ స్పష్టమైన మెజారిటీ సాధించనున్నట్లు అంచనాలు ఉన్నాయి. వూచిక్ పార్టీ 105 స్థానాలకే పరిమితం కానుంది. ఓట్ల శాతంలో విద్యార్థుల కూటమికి 52శాతం రాగా, SNS పార్టీకి 32.3శాతం దక్కాయి. (యూగోస్లేవియా  విడిపోయిన తర్వాత గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 70శాతం పోలింగ్ నమోదైంది. దేశంలో మార్పును ఆకాంక్షిస్తూ ప్రజలు, ముఖ్యంగా యువత భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సెర్బియాలో వూచిక్ ఓటమితో.. పుతిన్ యూరప్‌లో మరో మిత్రదేశాన్ని కోల్పోయారు.ప్రజలు వీధుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. విద్యార్థుల నేతృత్వంలోని ప్రతిపక్ష ఉద్యమ కూటమి విజయం సాధించడంతో, దశాబ్దానికి పైగా వుసిచ్ అధికారానికి తెరపడింది. ఓటింగ్ శాతం దాదాపు 70శాతం కి చేరుకుంది,.ఇది 1992లో యుగోస్లేవియా విడిపోయినప్పటి నుండి అత్యధికం.

రాజకీయ అనుభవం లేని నిపుణుల విజయం..

ఈ ఎన్నికల్లో విద్యార్థుల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, వైద్యులు, కళాకారులు,వివిధ రంగాల నిపుణులే బరిలోకి దిగి విజయం సాధించారు.

ఉద్యమం నుంచి అధికారంలోకి..

2024 నవంబర్‌లో నోవి సాడ్ (Novi Sad) నగరంలో ఓ రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 16 మంది మృతిచెందిన ఘటనతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవినీతికి నిదర్శనమని విద్యార్థులు దాదాపు రెండేళ్లుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు.  ఈ నిరసనల ఒత్తిడి కారణంగానే వూచిక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది.

ప్రజల సంబరాలు.. 

వూచిక్ ఓటమి ప్రకటన వెలువడగానే రాజధాని బెల్‌గ్రేడ్‌తో పాటు సెర్బియాలోని ప్రధాన నగరాల వీధుల్లోకి వేలాది మంది ప్రజలు, విద్యార్థులు  సంబరాలు చేసుకున్నారు. విజయం సాధించాం.. అతని పాలన ముగిసింది.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఫలితం కేవలం సెర్బియా అంతర్గత రాజకీయాలనే కాకుండా, ఐరోపా (Europe) రాజకీయ రంగంలోనూ కీలక పరిణామాలకు దారి తీస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.