జ్యోతిష్య పండితులు.. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాలప్రకారం హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం మార్చి 3 వ తేదీన ఏర్పడుతుంది. హోలీ .. చంద్రగ్రహణం ఒకే రోజు వచ్చాయి కాబట్టి.. హోలికాదహనం ఎప్పుడు చేయాలి.. హోలీ సంబరాలు ఎప్పుడు జరుపుకోవాలి మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగకు జనాలు రడీ అవుతున్నారు. ఈ ఏడాది ( 2026) మార్చి 3 వ తేది వచ్చింది. అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అందువలన హోలీ సెలబ్రేషన్స్ ను నాలుగో తేది ఉదయం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
హోలికా దహనం, హోలీ తేదీ
హోలి పండుగ ఫాల్గుణ మాసం పూర్ణిమ రోజు వస్తుంది. ఈ ఏడాది ( 2026) ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథి మార్చి 2న సాయంత్రం 05:55 గంటలకు ప్రారంభమై, మార్చి 3న సాయంత్రం 05:07 గంటలకు ముగుస్తుంది. హోలీ జరుపుకునే తేదీని నిర్ణయించడంలో పౌర్ణమి తిథి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హోలికా దహన్ 2026 మార్చి 2న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మార్చి 4న రంగులతో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని పండితులు, జ్యోతిష్య నిపుణులు పంచాంగాల ఆధారంగా స్పష్టత ఇచ్చారు.
ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథి వివరాలు:
- పూర్ణిమ తిథి ప్రారంభం మార్చి 02, 2026న సాయంత్రం 05:55 గంటలకు
- పూర్ణిమ తిథి ముగింపు : మార్చి 03, 2026న సాయంత్రం 05:07 గంటలకు
పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది హోలీ వేడుకలు రెండు రోజులుగా చేసుకోవాలి. సంప్రదాయం ప్రకారం మొదటి రోజు హోలికా దహనం, రెండో రోజు రంగుల హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
హెూలికా దహనానాకి శుభ ముహూర్తం
- మార్చి2 సాయంత్రం 06:22 గంటల నుంచి రాత్రి 08:50 గంటల వరకు
- భద్ర కాలం : మార్చి 3 ఉదయం 01:25 నుంచి గంటల వరకు 04:30 వరకు
ప్రదోష కాలంలో, పూర్ణిమ తిథి ప్రకారం మార్చి2 సాయంత్రం హోలికా దహనం జరుపుకోవాలి. భధ్ర కాలానికి ముందుగా హోలికాదహన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. హోలికా దహనం చెడు మీద మంచి విజయం సాధించిన సంకేతంగా భావించబడుతుంది.ప్రజలు చెడు ఆలోచనలు, నెగటివ్ శక్తులను దూరం చేయాలని సంకల్పంతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తారు.
కాని గ్రహణం సమయంలో మంత్రాలకు ఎంతో శక్తి ఉంటుంది. ఆ సమయంలో చేసే జపం.. అనుష్టానం.. మొదలైన వాటికి వేల రెట్లు ఫలితం ఉంటుంది. ఆసమయంలో గ్రహాల శక్తి చాలా ఎక్కువుగా ఉంటుంది. చంద్రగ్రహణం.. హోలీ పండుగ ఒకే రోజు వచ్చినందున రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.
హోలీ పండుగ రోజే వసంత రుతువు ప్రారంభమవుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి రంగులు చల్లుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. హోలీ సంబరాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడకుండా మార్చి 4 వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పండితులు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
