హోండా బైకుల కంటెయినర్ బోల్తా..

హోండా బైకుల కంటెయినర్ బోల్తా..

అనంతపురం: చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలో యర్రంపల్లి పెట్రోల్ బంక్ వద్ద హోండా బైకులతో వెళ్తున్న కంటెయినర్ అదుపుతప్పి బోల్తాపడింది. హర్యానా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈ కంటెయినర్ లో  హోండా ద్విచక్ర వాహనాలు..  స్పేర్ పార్ట్స్ తో వెళుతోంది. తెల్వారుజామున 4 గంటల ప్రాంతంలో కంటైనర్ గూడ్స్ వెహికల్ అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్… క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. క్లీనర్ గఫార్ కు స్వల్ప గాయాలు కాగా.. డ్రైవర్ సద్దాం క్షేమంగా ఉన్నాడు.