Devara Shooting: వరుస ప్రమాదాలతో దేవర షూటింగ్..హాస్పిటల్లో చేరిన 20 మంది ఆర్టిస్టులు?

Devara Shooting: వరుస ప్రమాదాలతో దేవర షూటింగ్..హాస్పిటల్లో చేరిన 20 మంది ఆర్టిస్టులు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ మొదలు ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్ వరకు షూటింగ్ టైంలో గాయపడ్డారు. 

తాజాగా మరోసారి దేవర షూటింగ్ స్పాట్లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ మూవీ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.అయితే షూటింగ్ చేస్తున్న టైంలో అనుకోకుండా షూటింగ్ స్పాట్లో ఉన్న ఒక తేనె తుట్ట కదలడంతో తేనెటీగలు దాడి చేసినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో షూటింగ్ స్పాట్ లో ఉన్న 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టుల మీద తేనెటీగలు దాడి చేసినట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

అయితే, ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. షూటింగ్ జరిగిన ప్రదేశంలో ఫోటోలు,వీడియోలు తీయకుండా సినిమా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఐతే ఈ ప్రమాదం గురించి సినిమా యూనిట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.