మెగా ఆఫర్ కొట్టేసిన హనీ రోజ్.. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో కీ రోల్?

మెగా ఆఫర్ కొట్టేసిన హనీ రోజ్.. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో కీ రోల్?

మళయాళ నటి హనీ రోజ్(Honey Rose) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. చేసిన ఒక్క సినిమాతోనే సూపర్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. దాంతో.. హనీ రోజ్ టాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ అవుతుందని అందరూ ఆశించారు. కానీ, అలా జరగలేదు. వీరసింహరెడ్డి తరువాత ఒక్క సినిమాలో కూడా ఆమెకు ఆఫర్ దక్కలేదు. 

కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ పాపులర్ అయ్యింది హనీ. షాపింగ్ మాల్‌ ఓపెనింగ్స్ అంటూ తెగ రచ్చ చేసింది. అయితే తాజా సమాచారం మేరకు.. హనీ రోజ్ మరో తెలుగు సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాలో చిరుకి జోడిగా హనీ నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక విశ్వంభర సినిమాలో చిరుకు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని, అనుష్క, మృణాల్ ఠాకూర్ ఉన్నారనే వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. కానీ, ఆ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఆ లిస్టులో హనీ రోజ్ కూడా చేరింది. ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. యూవీ క్రియేషన్స్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చోటా కే నాయుడు కెమెరామెన్ గా చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.