
అంజలి లీడ్ రోల్లో వస్తున్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడు. శనివారం ఈ మూవీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. అంజలి మాట్లాడుతూ ‘సినిమా చూశాను. చాలా బావుంది. విజువల్, గ్రాండ్ నెస్‌తో పాటు స్టార్ కాస్ట్ పెరిగింది. ‘గీతాంజలి’లో నవ్వించిన శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, రాజేష్‌తో పాటు అలీ, సునీల్, సత్య యాడ్ అయ్యారు. గీతాంజలి ముద్దుగా కనిపించినా, తను చేసే పనులు భయపెడతాయి. కోన గారి కామెడీ ట్రాక్, సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడికి ఈ చిత్రం పెద్ద బ్రేక్‌ను ఇస్తుంది’ అని చెప్పింది.
‘కథ వినగానే థ్రిల్ అయ్యా. నవ్విస్తూ భయపెట్టిస్తూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని శ్రీనివాసరెడ్డి చెప్పాడు. కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని అమెరికాలో తీద్దామనుకున్నాం. కానీ టెక్నికల్, ప్రాక్టికల్ కారణాలతో ఊటీలో తీశాం. ప్రేక్షకులు తమ అంచనాలకు మించి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. నటుడు రవికృష్ణ, డైరెక్టర్ శివ తుర్లపాటి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, డీవోపీ సుజాత సిద్ధార్థ్, ఎడిటర్ చోటా కె.ప్రసాద్ పాల్గొన్నారు.