డీజే సౌండ్ కు కూలిన ఇంటి పెచ్చులు..సిద్దిపేట జిల్లా పెద్దకోడూర్ లో ఘటన

 డీజే సౌండ్ కు కూలిన ఇంటి పెచ్చులు..సిద్దిపేట జిల్లా పెద్దకోడూర్ లో ఘటన
  • ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు

సిద్దిపేట రూరల్, వెలుగు: డీజే సౌండ్ మోతకు పాత ఇందిరమ్మ బిల్డింగ్  పెచ్చులు కూలి ఐదుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు కొనింటి శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం..  గురువారం రాత్రి శ్రీహరి తన భార్య పల్లవి, కుమారుడు మనస్తిత్, కూతుళ్లు  వివేక, స్వాతితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుర్గామాత నిమజ్జన సమయంలో పెట్టిన డీజీ సౌండ్ కు తన ఇల్లు పెచ్చులు కూలి వారిపై పడ్డాయి. వారిలో మన స్తిత్, వివేకకు తీవ్ర గాయాలు కాగా, మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.