ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి మెట్లు ఇంటికి మధ్యలో ఉంటే ఇబ్బందులు వస్తాయా.. అలాగే ఇంటి ప్రహరీ పక్కనే బాత్రూమ్ నిర్మిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం..
ప్రశ్న: ఇంటి ప్రధాన ద్వారం పడమర వైపు ఉంది. ఇంటి మధ్యలో మేడపైకి మెట్లు పెట్టుకోవచ్చా? అవి కూడా స్పైరల్ స్టేప్స్ ఏర్పాటుచేసుకోవచ్చా?
జవాబు : ఇంటి మధ్యలో మేడపైకి మెట్లు ఉండేలా కట్టుకోకూడదు. పడమర ప్రధాన ద్వారం కాబట్టి, పడమర నైరుతిలో మెట్లు కట్టుకోవచ్చు. తూర్పు నుంచి పడమర లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఎక్కేలా ఉండాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు సూచిస్తున్నారు.
ప్రశ్న: ఇంటి బయట, ప్రహరీ లోపల బాత్రూమ్ ఎటువైపు కట్టుకుంటే మంచిది?
జవాబు : ఇంటి బయట గెస్ట్ ల కోసం బాత్రూమ్ కట్టుకోవాలనుకుంటే ఉత్తర వాయువ్యం లేదా ఆగ్నేయంలో కట్టుకోవచ్చు. అయితే, ఉత్తర దిక్కు ప్రహరీకి, ఇంటి గోడకు తగలకుండా కట్టుకోవాలి. ఆగ్నేయం దిక్కు బాత్రూమ్ కట్టుకుంటే దక్షిణ దిక్కు గోడకు తగలొచ్చు. కానీ, తూర్పు గోడకు తగలకూడదు. మధ్యలో గ్యాప్ ఉండాలి. దీనికి సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలన్నా వాయువ్యం లేదా ఆగ్నేయం దిక్కులో ఉండటం మంచిదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు చెబుతున్నారు.
