Vastu tips: ఇంటిని నిర్మించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మూడువైపులా రోడ్లు ఉంటే వాస్తు దోషం ఉంటుందా..!

Vastu tips: ఇంటిని నిర్మించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మూడువైపులా రోడ్లు ఉంటే వాస్తు దోషం ఉంటుందా..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..  ఇంటికి మూడు వైపులా రోడ్లు ఉంటే వాస్తు ప్రకారం దోషం ఉంటుందా.....మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న:  ఇల్లు కట్టుకునేముందు వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జవాబు: కొత్త ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనుకుంటే వాస్తు దోషాలు లేని స్థలంలోనే కట్టుకోవాలి. నేల కూడా బాగుండాలి. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, నిర్మాణాలు వంటివి కూడా చూసుకోవాలి. ఏవైనా దోషాలున్నాయి అనిపిస్తే నివారణ చర్యలు తీసుకుని, పరిహారం చేసుకుంటే బెటర్ అని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్  సూచిస్తున్నారు.

ప్రశ్న: ఇంటి స్థలానికి మూడు వైపులా వీధులు ఉంటే ఏమైనా వాస్తు దోషం ఉందా?

జవాబు: ఇంటి చుట్టూ ఎన్ని వీధులు ఉన్నా ఇళ్లు కట్టుకుంటే తప్పులేదు. అయితే రోడ్లు ఏవైపు ఉన్నాయి? ఎటు వైపు ఫేసింగ్​ తో ఇల్లు కట్టుకోవాలి? అనేది అన్ని దిక్కులు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్  చెబుతున్నారు.