ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. కొత్తగా ఇల్లు కొన్నా.. కట్టుకున్నా.. ఎవరి పేరున రిజిష్ట్రేషన్ అయితే వారే గృహప్రవేశం చేయాలా.. లేదా కుమారులు పేరుపై రిజిష్ట్రేషన్ అయిన ఇంటికి తల్లి దండ్రులు గృహప్రవేశం పూజ చేయవచ్చా.. ఇంటిలో నుంచి వేస్ట్ వాటర్ ఏ దిక్కునుంచి బయటకు పోవాలి. .మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న: ఈ మధ్యే కొత్త ఇల్లు కొనుక్కున్నాం.గృహప్రవేశం మా అమ్మానాన్నలతో చేయిద్దామని అనుకుంటున్నాం? గృహప్రవేశం ఎవరు చేయాలి?
జవాబు: ఇల్లు మీరు కట్టుకుని, మీ పేరునే రిజిస్టర్ అయినా సరే.. ఇంట్లో పెద్దవాళ్లుంటే, వాళ్లతో గృహ ప్రవేశం చేయించడం చాలా మంచిది. అమ్మానాన్నలతో చేయిస్తే ఇంకా మంచిది. వాళ్లతోపాటు మీరు కూడా పూజలో కూర్చోవాలి, పెద్దవాళ్లకు సరైన స్థానం ఇవ్వడం చాలా మంచిది. శాస్త్రప్రకారం గృహ ప్రవేశం చేస్తే చాలు, ఎలాంటి దోషం ఉండదు.
ప్రశ్న: ఇంటి అవసరాలకు వాడిన నీళ్లు బయటకు ఎటువైపు పోయేలా ఏర్పాటు చేసుకోవాలి?
జవాబు:బాత్రూమ్ , ఇంటి అవసరాల కోసం వాడిన నీళ్లు ఆగ్నేయం లేదా వాయువ్యం వైపు నుంచి బయటకు పోవాలి. అలా ఏర్పాటు చేసుకుంటే మంచిది.
