పిన్ కోడ్ పోయె.. డిజిపిన్ వచ్చే.. ఇక ప్రతీ ఇంటికీ డిజిటల్ పిన్!

పిన్ కోడ్ పోయె.. డిజిపిన్ వచ్చే.. ఇక ప్రతీ ఇంటికీ డిజిటల్ పిన్!

పిన్ కోడ్ అంటే ఐడియా ఉండే ఉంటుంది.. ఏదైనా అడ్రస్ ఫిల్ చేయాల్సి వచ్చినపుడు పిన్ కోడ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీని గురించి నైంటీస్ కిడ్స్ కు, అంతకు ముందు తరాలకు బాగా ఎరుక.  ఫోన్ సదుపాయం లేనప్పుడు ఎక్కడికైనా ఉత్తరాల ద్వారా బాగోగులు, సమాచారం ఇచ్చేవారు. అడ్రెస్ విషయంలో ఎంతీ కీలకమైన ఈ పిన్ కోడ్ కు దాదాపు టాటా చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. పిన్ కోడ్ స్థానంలో డిజిపిన్ (DigiPIN) తీసుకొచ్చింది పోస్టల్ శాఖ. అసలు డిజిపిన్ అంటే ఏంటి.. ఎలా పనిచేస్తుందో చూద్దాం.

చిరునామాకు సంబంధించి కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్. 6 అంకెల పిన్ కోడ్ ను పక్కనపెట్టి ఇప్పుడు.. దాని స్థానంలో ఇప్పుడు 10 అంకెల డిజిపిన్ ను ప్రవేశపెట్టింది. ఈ 10 అంకెల డిజిటల్ కోడ్ ఇంటికి లేదా షాపుకు సంబంధించిన కచ్చితమైన లొకేషన్ ను ఇస్తుంది. 

 పిన్ కోడ్ అనేది ఒక పూర్తి ఏరియాకు సంబంధించి ఉండేది. అయితే అందుకు భిన్నంగా డిజిపిన్ అనేది ఒక అడ్రెస్ కు సంబంధించి నాలుగు మీటర్ల పరిధిలో కచ్చితమైన లొకేషన్ ను అందిస్తుంది. అంటే 4 మీటర్ల పరిధిలోకి వచ్చిన వ్యక్తికి లేదా వాహనదారునికి ఇంటి లేదా షాపు అడ్రెస్ ను పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. అదే పిన్ కోడ్ అయితే ఆ ఏరియా మాత్రమే చూపిస్తుంది. అక్కడికి వెళ్లి అడ్రెస్ వెతుక్కోవడం చాలా కష్టమైన పని.

-ఇండియా పోస్ట్, ఐఐటీ హైదరాబాద్,NRSC, ISRO సంయుక్తంగా ఈ డిజిపిన్ ను అభివృద్ది చేశాయి. ఇది ఆన్ లైనే కాదు ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది. 

ఉపయోగాలు:

  మెయిల్, పార్సెల్‌లు సరైన ఇంటికే చేరుతాయి. ఇకపై గల్లీలు, వీధులు, పరిసర ప్రాంతాలలో అడ్రస్ దొరకక తిరగాల్సిన అవసరం లేదు.

  •  అంబులెన్స్, ఫైర్  వంటి ఎమర్జెన్సీ సేవలకు ఖచ్చితమైన అడ్రెస్ తెలుస్తుంది.
  •   ఇ-కామర్స్ డెలివరీ మరింత వేగంగా, కచ్చితంగా ఉంటుంది.
  •   గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో అడ్రెస్ సమస్యలు తొలగిపోతాయి.

అడ్రెస్, లొకేషన్ విషయంలో డిజిపిన్ చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా ఏరియాకు సంబంధించి అడ్రెస్ ఎంట్రీ చేసేటప్పుడు ఇంటి నెంబర్ 12, వీధి నెంబర్ 3 అని రాయాల్సిన పనిలేదు. జస్ట్ డిజిపిన్ ఇస్తే సరిగ్గా మీ ఇంటి ముందుకు తీసుకువస్తుంది. 

మీ డిజిపిన్ ఎంత..?

డిజిపిన్ తెలుసుకోవడం చాలా ఈజీ.  

dac.indiapost.gov.in/mydigipin/home అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి.. మ్యాప్ లో మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడే 10 అంకెల డిజిపిన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.