మోసం అనేది సాధారణంగా అవకాశం కోసం ఎదురుచూడటం, మాయమాటలు చెప్పడం..నమ్మకాన్ని వమ్ము చేయడం ద్వారా మొదలవుతుంది. మోసం చేసే విధానం సందర్భాన్ని బట్టి మారుతుంటుంది. అసలు మోసాలు ఎలా మొదలవుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మోసం తరచుగా సాధారణ సంభాషణలలోనే మొదలవుతుంది. ఎవరైనా అత్యంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం ద్వారా, అదే విషయాన్ని పదేపదే చెబితే దానిని ఏకీభవిస్తారు.. మరికొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. ఒక్కోసారి ఆ మాటలు మీపై సామాజిక ఒత్తిడిమిమ్మల్ని ప్రభావితం చేసేలా ఉంటాయి.
ఇలాంటి వారి ఎత్తుగడలు వారి అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించేలా ఒత్తిడి తెస్తారు. దీని నుంచి బయట పడాలంటే.. ఆ మాటలు మనకు సంబంధం లేకపోయినా.. మనకు అవసరం లేదనిపించినా..ప్రశాంతంగా ఆలోచించాలి. వెంటనే స్పందించకుండా.. కొద్దిసేపు అవి ఎంతవరకు ఉపయోగపడతాయో నిర్ణయానికి ఆ మాటలలో ఎంత వరకు ఉపయోగపడితే అంతవరకే పరిగణరలోకి తీసుకోవాలి. మిగతా విషయాలను ఒక చెవితో విని మరో చెవిలో నుంచి బయటకు పంపేయాలి. ఇలా మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు ఒత్తిడికి ప్రభావితం కాకుండా ఉంటారు
ALSO READ : మీరు స్మార్ట్ వాచ్ వాడితే ఇది తెలుసుకొని తీరాలి..
మోసం చేసేవారు.. చేయాలనుకొనేవారు.. అందంగా తయారవుతారు. మన దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి ఆకర్షితులవుతారు. ఆ తరువాత మీదగ్గర ఏమేమి ఉన్నాయి.. మీ మాటలు ఎలా ఉన్నాయి అనే వాటిని పసిగడతారు. ఆ తరువాత మీరు చాలా బాగుంటారు. అలా మిమ్ములను పొగడుతాయి. ఆ తరువాత మీ దగ్గర విలువైన వస్తువులపై కన్నేస్తారు. ఆ తరువాత మీరు ఏమరుపాటుగా ఉన్న సమయంలో మిమ్మలను మాటలలో దింపి మోసాలకు పాల్పడుతారు. అందుకు ఇతరులు.. మీకు తెలియని వారు మీతో మాటలు కలుపుతున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
మోసం చేసే వారికి ప్రత్యేక రూపం ఏమీ వుండదు వారు అందరి లానే వుంటారు..మోసం అనేది మనిషి లో ఒక చెడుగుణం తప్ప అది రూపం కాదు..నిజానికి మోసం చేసే వారికి ఒక రూపం మంచి వారికి ఒక రూపం వుంటే ఎవరు ఏమిటి అన్నది గుర్తు పట్టి ఈ లోకంలో ఎవరూ ఇంక మోసపోరు..కొందరు మంచి వారిలా మాటలాడి మోసం చేస్తుంటారు కొందరు అమాయకులమని చెప్పి మోసం చేస్తుంటారు…
వాళ్ళు పైకి ఒక ప్రవర్తనతో వుండి లోపల వారి నిజమైన స్వబావంతో వుంటారు..మనం వారిని అన్నీ వేళలా కనుక్కోలేం..కానీ ఈరోజులు బట్టి ఎవరినీ అంత త్వరగా నమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించాలి..మోసపోయే వాడు సాధారణంగా తెలివితక్కువవాడని అందరూ అనుకుంటారు.
ఎదుటి వ్యక్తిని అతిగా నమ్మి.. అసలైన నిజాయితీపరుడు మోసపోతాడు. తనలాగే ఎదుటివాడు కూడా నిజాయితీగా ఉంటాడని నమ్మకమూ అతని మోసానికి కారణమవుతుంది. అతనిది నైతికమానవీయ తెలివి కానీ తెలివి లేనివాడు కాదు. అతని లోపం మాట్లాడే మాటల గురించి అవగాహన లేకపోవడం.. నమ్మడం వంటి వాటివలన మోసపోతారు. అయితే ఒకసారి మోసపోయిన తర్వాత వచ్చిన అనుభవంతో భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా, వివేకవంతులుగా ఉంటారు.
మరీ ఇప్పుడైతే కొన్ని చోట్ల దగ్గర ఎంతో బాగా తెలిసిన వారు కూడా మోసం చేస్తున్నారు..నీతో తిరిగిన వాడి గుణమే నువ్వు కనుక్కొలేదు ఇంకా బయట వారిని మనం కనుక్కోగలమా కానీ ఇప్పుడు కంటి రెప్పని కూడా నమ్మలేని పరిస్తితి…జాగ్రత్తగా వుండాలి
