ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. ఇంటి నిర్మాణమే కాదు.. ప్రహరీగోడ.. ఆ గోడకు ఉండే గేట్లు కూడా వాస్తుప్రకారమే ఉండాలి. ప్రహరీ గోడలకు ఎన్ని గేట్లు ఉండాలి.. అలానే ఫామ్ హౌజ్లో పశువుల కొట్టాం ఏ దిక్కులో ఉండాలి.. .మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం.
ప్రశ్న: ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రహరికి ఎన్ని గేట్లు ఉండాలి. మూడు గేట్లు పెట్టాలి. అనుకుంటున్నాం? ఇన్ని గేట్లు మాత్రమే పెట్టాలనే లెక్క ఉంటుందా వాస్తు ప్రకారం?
జవాబు: ప్రహరీకి రెండు లేదా నాలుగు గేట్లు ఉంటే మంచిది. మూడు గేట్లు పెట్టొద్దు. గేట్లు సరిసంఖ్యలోనే పెట్టుకోవాలి.
పశువుల కొట్టం ఏవైపు ఉండాలి?
ప్రశ్న: ఫామ్ హౌజ్లో ఆవులు, గేదెల కోసం పశువుల కొట్టం కట్టాలి.అనుకుంటున్నాం? చుట్టూ ఖాళీ స్థలమే ఉంది. ఎటువైపు కట్టుకుంటే బాగుంటుంది?
జవాబు: ఆగ్నేయం లేదా వాయువ్యం మూలలో పశువుల కొట్టం కట్టుకుంటే మంచిది. అలానే కట్టుకోండి.
