Bholaa Shankar : భోళా శంకర్ మూవీకు..కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతంటే?

Bholaa Shankar : భోళా శంకర్ మూవీకు..కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  భోళా శంకర్ (Bhola Shankar). స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్(Keerthy Suresh) చిరుకు చెల్లిగా కలిపించింది. భోళా శంకర్ నేడు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ మూవీలో కీర్తి సురేష్  క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా ఉందని తెలుస్తోంది. దీంతో అందరి కళ్ళు కీర్తి వైపు చూస్తున్నాయి. 

రీసెంట్ గా నాని దసరా మూవీతో సూపర్ హిట్ కొట్టింది కీర్తి. ఇప్పుడు లేటెస్ట్ భోళా మూవీలో కూడా తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేస్తుందని టాక్ నడుస్తుంది. దీంతో  హీరోయిన్ గా,చెల్లెలు గా నటిస్తున్న తన కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.  

భోళా శంకర్ మూవీలో చెల్లెలుగా కనిపిస్తోన్న కీర్తికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. ఈ మూవీలో కథ మొత్తం చెల్లెలు క్యారెక్టర్ చుట్టూ తిరగుతుంది.దీంతో  కీర్తి సురేష్ కు రూ 1.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారంట.ప్రస్తుతం హీరోయిన్ గా ఏ మూవీలో యాక్ట్ చేసిన ఇంతే మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక ఈ మూవీ కనుక సూపర్ హిట్ అయితే కీర్తి రేంజ్ మరో లెవెల్కు వెళ్తుందని అంచనా వేస్తున్నారు సినీ క్రిటిక్స్.   ఎందుకంటే, సపోర్టింగ్ రోల్ చేసిన..ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడమే హాట్ టాపిక్ మారింది. 

గతంలో రజినీకాంత్ అన్నాత్తై మూవీలో చెల్లెలు క్యారెక్టర్ లో చేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో  నాయకుడు మూవీలో నటించి మెప్పించింది.  సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా తమన్నా(Tamannaah) నటించగా..కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా కలిపించింది. అక్కినేని హీరో సుశాంత్ మరో కీ రోల్ లో కనిపించారు. తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను.. చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశామని తెలిపారు దర్శకుడు మెహర్ రమేష్.