Health tips:వర్షాకాలం.. వేడిచేసి వడకట్టిన మంచి నీళ్లే తాగాలి

Health tips:వర్షాకాలం.. వేడిచేసి వడకట్టిన మంచి నీళ్లే తాగాలి

క్లోరినేషన్ సరిగా చేయని మంచినీళ్లు, డ్రైనేజ్ సిస్టమ్ పాడైతే, ఆ కెనాల్స్ కు  దగ్గరలో ఉన్న బోర్ వేల్స్ వాటర్ పొల్యూట్ అవుతాయి. ఈ నీళ్లలో సూక్ష్మ జీవులు ఉంటే వాంతులు విరేచనాలు అవుతాయి. పొల్యూట్ వాటర్ తాగినప్పుడు వాంతులు లేదా విరేచనాలు అయినప్పుడు జ్వరం లేకుంటే ఆ నీళ్లలో కెమికల్స్ కలిసినట్లుగా గుర్తించాలి. జ్వరం ఉంటే వాటర్ పొల్యూషన్ వల్ల బ్యాక్టీరియా లేదా వైరస్ బాడీలోకి ఎంటరైనట్లు గుర్తించాలి. పొల్యూట్ అయిన వాటర్ తాగితే కామెర్లు కూడా వస్తాయి. ఫ్యామిలీలో ఎవరికైనా వాంతులు, విరేచనాలు అవుతుంటే తాగే మంచినీళ్లు ఎలా ఉన్నాయో టెస్ట్ చేసుకోవాలి.నల్లానీళ్లను వానాకాలంలో కాచి చల్లార్చిన తర్వాతే తాగాలి.

హెర్బల్ వాటర్ ప్యూరిఫికేషన్

పొల్యూట్ అయిన నీళ్లను హెర్బల్ ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు. నీళ్ల బిందెలో రాత్రి పూట చిల్ల గింజలు వేసి ఉంచితే తెల్లారే సరికల్లా నీళ్లు ప్యూరిఫై అవుతాయి. చిల్ల గింజలు లేకపోతే జల్ జీరా చేసుకోవాలి. మరిగే నీళ్లలో జీలకర్ర వేసిన తర్వాత బిందెను పొయ్యి మీద నుంచి దించాలి. చల్లారిన తర్వాత ఆ నీళ్లు తాగాలి.

డికాషన్

ఈ సీజన్ లో సాధారణ జ్వరం వస్తే గోరు వెచ్చని డికాషన్ తాగాలి. శొంఠి, తిప్పతీగ, నేలవేముతో డికాషన్ చేసుకోవచ్చు. ఈ డికాషన్ని అరకప్పు చొప్పున రోజుకు రెండు నుంచి మూడుసార్లు తాగాలి.