Good Parenting: టీనేజ్ పిల్లలతో ఎలా ఉండాలి..  వారికి ఎంతవరకు స్వేచ్చ ఇవ్వాలి..!

Good Parenting: టీనేజ్ పిల్లలతో ఎలా ఉండాలి..  వారికి ఎంతవరకు స్వేచ్చ ఇవ్వాలి..!

పిల్లలు ఎప్పుడు అదే వయసులో ఉండాలంటే ఎలా.? పెరిగి  పెద్దవుతుంటారు. వయసుతో పాటు ఆలోచనలు.. అభిప్రాయాలు మారతాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అమ్మానాన్నకు.. తెలియనివి ఎన్నో వాళ్లకు తెలుస్తాయి. అలవాట్లు, ప్రవర్తన, మాట అన్నింటిలో మార్పులు వస్తుంటాయి. దాంతో అప్పటి వరకు తన చుట్టూ తిరిగిన పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లితండ్రులు భావిస్తారు. 

అప్పటి వరకు ఏది కావాలన్నా తమను అడిగే వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటాన్నరని కంగారు పడతారు. ఎక్కడ దూరమై పోతారనే  భయం కలుగుతుంది. కానీ, తల్లిదండ్రులు పిల్లల్లో వచ్చే మార్పు అర్ధం చేసుకోవాలి, అంగీకరించాలి. లేదంటే పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతుంది. పెద్దయ్యాక కూడా తమతోనే ఉండమని, తాము చెప్పినట్లే వినమని అంటే పిల్లలకు కష్టమే.

 కాని వాస్తవానికి సొంత ప్రపంచాన్ని ఏర్పరచకునేది టీనేజ్ లోనే.  అ స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వాలి. అలాగని పూర్తిగా వదిలేయకూడదు. తల్లిదండ్రుల ఎప్పటికప్పుడు.. పిల్లల్లో వస్తున్న మార్పులను ఓ కంట కనిపెడుతుండాలి.  అవి మంచివా,చెడ్డవా అని గమనించాలి.

ఒకవేళ పిల్లలు పెడదోవ పడుతుంటే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అంతే కానీ, తమతో ఒకప్పటిలా ఉండటం లేదని, ప్రతి విషయాన్నీ తమతో షేర్ చేసుకోవడం లేదని వాళ్ల మీద కోపగించుకోకూడదు. అలా కోపం పెంచుకుంటే పిల్లలు మరింత దూరం అవుతారు.