
షాపింగ్ మాల్స్లో పార్క్ చేసిన కారును గుర్తించలేకపోతున్నారా..మనం తరుచుగా షాపింగ్ కు వెళ్లినప్పుడు గానీ, సైట్ సీయింగ్ కు వెళ్లినప్పుడు గానీ.. సినిమాకు వెళ్లినప్పుడు గానీ.. ఇలా రద్దీ గా ఉండే ప్రదేశాల్లో కారు పార్కింగ్ చేస్తుంటాం.. పని ముగించుకొని వచ్చి కారు ఎక్కడ ఉండి అని చాలా సార్లు వెతుక్కుంటుంటాం.. కొన్ని సందర్భాల్లో గంటల సమయం కూడా పడుతుంది.. అలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ ఓ మంచి ఫీచర్ ను మనకు అందుబాటులోకి తెచ్చింది. పార్కింగ్ చేసిన కారు, లేదా బైక్ లను గుర్తించేందుకు Google Maps, Google Assistant ద్వారా ఈజీగా కనిపెట్టొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
ముందుగా ఇవి మీ మొబైల్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి.
- -ముందుగా మీ మొబైల్ లోని Google Maps , Google App ను అప్ డేట్ చేసుకోవాలి.
- -ఆండ్రాయిడ్ వినియోగదారులు Android Marshmallow లేదా కొత్తది, Apple వినియోగదారులు iOs 10 లేదా కొత్త వెర్షన్లు ఉండాలి.
- -ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్లలో లోకేషన్ సర్వీస్, గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటాయి.
మీ కారు లేదా బైక్ లోకేషన్ ను సేవ చేయాలి
పార్కింగ్ చేసిన తర్వాత Google Maps ని ఓపెన్ చేసి కారు పార్కింగ్ చేసిన స్థానాన్ని సూచించే బ్లూ పిన్ ను నొక్కాలి. దీంతో మూడు ఆప్షన్లు వస్తాయి. వాటిలో Save Your Parking అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కారు ఫోటోలు, పార్కింగ్ నెంబర్లను కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతే కాదు .. Google అసిస్టెంట్ ను ఉపయోగించి నేను ఎక్కడ పార్క్ చేశానో గుర్తుంచుకోండి అని చెప్పడం ద్వారా మీ పార్కింగ్ స్థలాన్ని గుర్తుంచుకోమని చెప్పాలి.
పార్కింగ్ చేసిన కారును ఎలా గుర్తించాలంటే..
మీ కారు లేదా బైక్ ను గుర్తించాలనుకున్నప్పుడు Google Maps ‘తెరిచి సేవ్ చేసిన పార్కింగ్’ ను నొక్కాలి. నావిగేషన్ ను యాక్టివేట్ చేయడానికి డైరెక్షన్లపై నొక్కాలి. లేదా Google Assistant నా కారు ఎక్కడ ఉంది అని అడిగితే మీ కారు పార్కింగ్ ప్రాంతానికి దారి చూపిస్తుంది.
ఇలా గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ ను ఉపయోగించి మీ కారును పార్కింగ్ చేయడం, తర్వాత వాటి స్థానాన్ని గుర్తించడం ద్వారా సమయం, శక్తి రెండు ఆదా చేయొచ్చు.