ఫైటర్ టీజర్ వచ్చేసింది.. గ్లామర్ షోతో అదరగొట్టిన దీపికా

ఫైటర్ టీజర్ వచ్చేసింది.. గ్లామర్ షోతో అదరగొట్టిన దీపికా

బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్, గ్లామర్ డాల్ దీపికా పదుకోన్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్‌. వార్‌, పఠాన్ వంటి యాక్షన్ మూవీస్ తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్డ్రాప్ లో.. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సీనియర్ హీరో అనిల్‌ కపూర్‌ కీ రోల్ లో పాత్ర పోషిస్తున్న ఈ సినిమా.. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌లో ఒక్కో సీన్, ఒక్కో షాట్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా జెట్‌ ఫ్లైట్స్‌ సీక్వెన్సెస్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పఠాన్ తో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్‌ సిద్ధార్థ్ ఆనంద్‌.. మళ్ళీ అదే రేంజ్ లో ఫైటర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇక టీజర్‌లో హృతిక్ రోషన్‌, దీపికా పదుకోన్‌ ల మధ్య హాట్‌ హాట్ సీన్స్‌ కూడా చూపించారు. ఆ సీన్స్ లో దీపికా ధరించిన స్విమ్ సూట్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సీన్స్ చూసిన నెటిజన్స్ పెళ్లి తరువాత కూడా ఈ రేంజ్ లో ఎక్స్పోజింగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పఠాన్ దర్శకుడి నుండి వస్తున్న ఫైటర్ మూవీ అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందా చూడాలి.