అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కు చెందిన కంపెనీ రాకెట్ ఒకటి పెద్ద బాంబు మాదిరిగా పేలిపోయింది. బ్లూ ఆరిజిన్ కంపెనీకి చెందిన న్యూ గ్లెన్ రాకెట్.. పరీక్ష సమయంలో లాంచ్ చేసిన వెంటనే భారీ శబ్దంతో పేలింది. 2026 మే 28న ఈ ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ లాంచ్ ప్యాడ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
హాట్ ఫైర్ టెస్టు సమయంలో అసాధరణ పరిస్థితులు ఎదుర్కొన్నట్లు బ్లూ ఆరిజిన్ కంపెనీ పేర్కొంది. ఈ ఘటనలో ఏ ఒక్కిరికీ ప్రమాదం జరగలేదని ప్రకటించారు.
ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రోగ్రాం మాదిరిగానే.. స్టార్ లింక్ లాగే శాటిలైట్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో బ్లూ ఆరిజిన్ కంపెనీ ఈ గ్లెన్ రాకెట్ ను తయారు చేసింది.
హాట్ ఫైర్ టెస్టు సందర్భంగా.. రాకెట్ లాంచ్ అయ్యేముందు ఈ ప్రమాదం జరగటం బాధాకరం. లాంచ్ ప్రొసీజర్ సందర్భంగా.. ఇంజినీర్లు రాకెట్ ప్రొసీజర్ ప్రకారం ఇంజిన్లను వెలిగించారు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దంతో రాకెట్ బ్లాస్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై జెఫ్ బెజోస్ స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. ఎవరికీ పెద్ద ప్రమాదం జరగలేదని.. ప్రాణ నష్టం జరగలేదని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. సమస్యను గుర్తించి మళ్లీ ప్రయోగిస్తామని తెలిపారు.
ఫ్యూచర్ టెక్నాలజీ లో భాగంగా.. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో పాటు స్టార్ లింక్ కూడా శాటిలైట్ ఇంటర్నట్ సవల కోసం పోటీపడుతోంది. ఈ స్పేల్ లో వ్యాపారం కోసం అమెజాన్ సీఈవో జెబ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ పేరుతో కొత్త కంపెనీ తీసుకొచ్చారు. అందులో భాగంగా గ్లెన్ రాకెట్ ను ప్రయోగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
బ్లూ ఆరిజిన్ కంపెనీ 98 మీటర్ల ఎత్తులో ఉండి.. పెద్ద పెద్ద శాటిలైట్లు,స్పేస్ క్రాఫ్ట్ లను మోసుకెళ్లేందుకు న్యూ గ్లెన్ రాకెట్ ను సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రయోగం ఫెయిల్ అవ్వడంతో.. త్వరలోనే మళ్లీ లాంచ్ చేస్తామని కంపెనీ పేర్కొంది.
Sound synchronized from @NASASpaceflight footage pic.twitter.com/EWr9t8iegP
— Scott Manley (@DJSnM) May 29, 2026
