Fire accident : సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం

Fire accident : సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ రాంగోపాల్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న పలువురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. ఈ భవనంలోని అన్ని అంతస్థులకు  దట్టమైన పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారినట్లు సిబ్బంది తెలిపారు. భారీ క్రేన్ల సహాయంతో ఈ భవనంలో  చిక్కుకున్న వారెవరైనా ఉన్నారా అనే విషయాన్ని  పరిశీలిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.