వెదురు లోపల మొత్తం ఖాళీగా ఉంటుంది. మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు, కూడా మన శరీరాన్ని వెదురు కట్టెలాగా ఫీలవ్వాలి శరీరాన్ని వెదురులా పీలయినప్పుడు.. శరీరం లోపలంతా ఖాళీగా మారుతుంది. చర్మం, ఎముకలు, రక్తం అన్ని ఈ వెదురులో భాగమే! వాటి లోపల ఉన్న ఖాళీలో ఒక పవిత్రత ఉంటుంది. దీని గురించి ఓషో ప్రత్యేకంగా వివరించారు.
నోరు తెరువకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఏ పని చేయకుండా నాలుక పైకప్పుకు తాకుతూ మనసులో ఎలాంటి ఆలోచనల అలజడి లేకుండా ఉన్నప్పుడు ప్రత్యేకంగా దేనికోసం వేచి ఉండకుండా... శరీరం అంతా వెదురులా ఖాళీగా అనిపించినప్పుడు అకస్మాత్తుగా.. అనంతమైన శక్తి మనలోకి ప్రవహిస్తుంది. అది మనకు తెలియని, రహస్యమైన దైవశక్తితో నిండి ఉంటుంది. అప్పుడు ఆ వెదురు లాంటి శరీరం.. వేణువులా మారుతుంది. తర్వాత అది అందంగా మోగుతుంది!
ఎప్పుడైతే మనం ఖాళీగా మారుతామో అప్పుడు దైవత్వం మనలోకి ప్రవేశించడానికి ఎలాంటి అడ్డుగోడలూ ఉండవు. వెదురుగా మారే ధ్యానం... అందమైన ధ్యానాల్లో ఒకటి. దీనికోసం ప్రత్యేకంగా ఏం చేయనవసరం లేదు. ఇది వెంటనే జరిగిపోతుంది.
ఈజీగా
ఈజీగా రెస్ట్ తీసుకోండి. ఎలాంటి ఆధ్యాత్మిక కోరికలు కోరుకోవద్దు. స్వర్గాన్ని కోరుకోవద్దు. దైవభక్తిని కూడా కోరుకోవద్దు ఎందుకంటే.. దైవభక్తిని కోరుకోలేం. కోరిక లేకుండా ఉన్నప్పుడే.. అది వస్తుంది...
విముక్తి కోరుకోలేం.. అది కోరికల బందాల్లో చిక్కుకొని ఉంటుంది.
ఎప్పుడైతే మనం కోరికలు లేకుండా ఉంటామో అప్పుడే విముక్తి పొందుతాం. జ్ఞానోదయాన్ని కోరుకోలేం. ఎందుకంటే దానికి కోరికే అవరోధం! అవరోధం లేనప్పుడు, అకస్మాత్తుగా బుద్దుడు మనలో ప్రవహిస్తాడు. మీ దగ్గర ఇప్పటికేవిత్తనం ఉంది.
శరీరం ఖాళీగా ఉన్నప్పుడు. స్పేస్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఖాళీ వెదురులాగా విశ్రాంతి తీసుకోవాలి. ఇవ్వడానికి ఏమీ లేదు, పొందటానికి ఏమీ లేదు. ఇచ్చే అవసరం లేదు. తీసుకునే అవసరమూ లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో. అలాగే ఫర్ పెక్ట్ గా ఉన్నాం అనుకోండి చాలు ఎంప్టీనెస్ అనేది ధ్యానాల్లోకెల్లా... అందమైన ధ్యానం!
వెస్ట్ లో తప్పుగా
దీని గురించి వెస్టర్న్ కంట్రీస్ లో తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇది ఏ రకమైన టీచింగ్" ఖాళీగా ఉంటే ప్రజలు కష్టపడరు.
ఆపై వాళ్లు ఎదగడానికి ప్రయత్నించరు. తమ క్యారక్టర్ మార్చుకోవడానికి ఎలాంటి ఎఫర్ట్ పెట్టరు. మంచి దారుల్లో ప్రయాణించడానికి ముందుకురారు." అని అనుకున్నారు. దాంతో 'మదల్ని మనమే ఇంహన్ చేసుకోవాలి' అనే స్లోగన్ వెస్ట్ పాపులర్ అయింది. ఎలా ఇంప్రూవ్ కావాలి? ఎలా గొప్పగా మారాలి? ఇలాంటి ఆలోచనలతోనే పరుగులు తీయడం మొదలు పెట్టారు.
లోతుగా అర్థం చేసుకున్నాం
తూర్పున, మేం దీన్ని మరింత లోతుగాఅర్ధం చేసుకున్నాం. ఏదైనా ఒకటి కావాలనుకోవడమే అన్నింటికంటే పెద్ద అపరోధం... ఎందుకంటే మీరు ఇప్పటికి మీతో ఉన్నారు. ఇంకా మీరు ఏమీ కానవసరం లేదు. సింపుల్ గా మీరు ఎవరో? రియలైజ్ అయితే చాలు. అంతే, మీలో ఎవరు దాగి ఉన్నారో గ్రహించండి.
ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా. .. చేయాలనుకున్నా లక్ష్యం పెట్టుకున్నా... వెంటనే యాంగ్జీటీలో పడిపోతారు. ఎందుకంటే ఇంప్రూవ్ మెంట్ మెంట్ కోసం చేసే ఏ ప్రయత్నమైనా తప్పు దారిలో నడిచేలా చేస్తుంది. ఇది ఫ్యూచర్ ని,ఐడియల్స్ని, మీనింగ్ ఫుల్ గా మారుస్తుంది. దాంతో మనసు కోరికలు పుట్టగా మారుతుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలిసిందే!
కాబట్టి, అలలు లేని కొలనులా మనసు కూడా కోరికలు లేని కొలనుగా మార్చుకోవాలి. వెదురులా ఖాళీగా మార్చుకోవాలి. ఇప్పుడు అకస్మాత్తుగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎంప్టీనెస్ లో దైవత్వం ప్రవహించినప్పుడు వేణువులా మారిపోతారు!! అంతకు మించిన సంతోషం ఏం ఉంటుంది?.
