ఇది కదా మానవత్వం అంటే.. బిల్లింగ్ పైనుంచి పడ్డ చిన్నారి.. కాపాడేందుకు యువకుడు స్పందించిన తీరు నెట్టింట చర్చ
ఈ కాలంలో మానవత్వం ఎక్కడుంది. ఎవడి స్వార్థం వాడిదే.. చస్తున్న చూస్తూ వెళ్తారు కానీ పట్టించుకువాడు కరువయ్యాడు.. హత్యలు చేస్తుంటే వీడియోలు తీస్తారు గానీ రక్షించేవాడు లేదు.. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టించుకోకుండా పక్కనుంచి వెళ్తారు.. ఇలా ఏదైన మనసు చలించే భయంకర ఘటనలు, హత్యలు చూసినప్పుడు మనకు వినిపించే మాటలు.. కానీ ఓ చిన్నారి బిల్డింగ్ పైను పడితే ఓ యువకుడు స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.
ఓచిన్నారి బిల్డింగ్ పైనుంచి పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.. ఈవీడియోలు పడిపోయిన ఆ బాలికను చేతులపై ఎత్తుకొని పరుగులు పెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మానత్వం కరువైందని అనుకుంటున్న ఈ రోజుల్లో ఆ యువకుడు మానవత్వంతో , సమయస్ఫూర్తితో చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు చేసిన సాహసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
షాపునుంచి తిరిగి వస్తున్న యువకుడు తిరిగి వస్తుండగా.. ఆకస్మాత్తుగా బాలిక ఇంటి పైకప్పునుంచి రోడ్డుపైపడింది. మొదట ఆ యువకుడు భయపడినప్పటికీ చిన్నారిని చూడగానే చేతిలో ఉన్న వస్తువులను విసిరి ఆమెను ఎత్తుకొని డైరెక్టుగా ఆస్పత్రికి తీసెకెళ్లాడు. సకాలంలో చికిత్స అందితే ఆమె ప్రాణాలు కాపాడవచ్చని గ్రహించిన ఆ యువకుడు సమయస్పూర్తితో
భయపడకుండా, ఇతరుల సాయం కోరకుండా వెంటనే ఆస్పత్రికి చేర్చిన అతని మానవత్వానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
మానవత్వం ఈనాటికీ సజీవంగా ఉంది, అటువంటి వారికి వందనాలు..అంటూ పోస్టులు షేర్ చేశారు. డౌటే లేదు.. ఒకరి ప్రాణాన్ని కాపాడటానికి ఆ యువకుడు చేసిన ప్రయత్నం ప్రశంసనీయం అని రాశారు. అలాంటి వాళ్ళు ఉండాలి. కానీ చాలా మంది వీడియోలు తీయడం దాటి ముందుకు వెళ్లలేరు. ఇక్కడ కూడా, ఆ ఒక్క యువకుడు మాత్రమే పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతనికి సహాయం చేయడానికి ఇంకెవరూ ముందుకు రాలేదు. అంటూ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఏదీ ఏమైనా యువకుడు చేసిన పనికి హాట్పాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.
एक युवक दुकान से कुछ लेकर आ रहा था,
— Haji Nizamuddin Abbasi (@HajiNizamuddin3) July 15, 2026
तभी सड़क पर एक लड़की अचानक छत से गिरी, पहले तो डर गया
जब उसने देखा बच्ची है, उसे उठा कर तुरंत हॉस्पिटल भागा ,अपना सामानभी नहीं उठाया,
वह जानता था लड़की को अगर समय पर इलाज मिल जाए तो उसकी जिंदगी बच सकती है।
युवक की मानवता को सलाम। pic.twitter.com/Q3x75xpzze
