కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామ పెద్దలతో ఉన్న విభేదాల కారణంగా తమను బతుకమ్మ ఆడకుండా అడ్డుకున్నారని పోలీసులను ఆశ్రయించారు దంపతులు. జిల్లాలోని చాకలివాని పల్లెలో సద్దుల బతుకమ్మ రోజున జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
చాకలివాని పల్లె గ్రామానికి చెందిన భారతవ్వ బతుకమ్మ ఆడేందుకు వెళ్లగా గ్రామ పెద్దలు అడ్డుకున్నారు. అందరి బతుకమ్మల దగ్గరికి తన బతుకమ్మను తీసుకెళ్లగా గ్రామ పెద్దలు అడ్డుకున్నారు. దీంతో 112కి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశానని... ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పినా తనను బతుకమ్మ పెట్టనివ్వలేదని ఆరోపిస్తోంది బాధితురాలు.
తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు దంపతులు. 25 మంది గ్రామ పెద్దలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మల్లయ్య, భారతవ్వ. అయితే, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని మల్లయ్యపై మరో ఫిర్యాదు చేయడంతో గందరగోళం నెలకొంది.
