Gayathri Reddy: ఎఫైర్స్ నడుపుతూ అదే లైఫ్ అనుకుంటున్నారు.. హుషారు నటి షాకింగ్ కామెంట్స్!

Gayathri Reddy: ఎఫైర్స్ నడుపుతూ అదే లైఫ్ అనుకుంటున్నారు.. హుషారు నటి షాకింగ్ కామెంట్స్!

హుషారు(Husharu) మూవీ ఫేమ్ నటి గాయత్రీ రెడ్డి(Gayathri Reddy) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. చాలా కాలం నుండి నటిగా సినిమాలు చేస్తున్న ఆమె.. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన బిజిల్ సినిమాలో ఫుట్ బోల్ ప్లేయర్ గా చేశారు.  ఆ సినిమా తరువాత లిస్ట్ అనే సినిమాలో కూడా నటించారు గాయత్రీ రెడ్డి. కానీ, హుషారు సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే.. హుషారు సినిమా సక్సెస్ తరువాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో సెటిలై తన భర్తతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. 

అయితే ఆమె చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్నారు కానీ, ఆడియన్స్ కు మాత్రం దూరంగా లేరు. తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోస్ చేస్తూ నెటిజన్స్ కు టచ్ లోనే ఉంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి షేర్ చేశారు గాయత్రి రెడ్డి. ఈ వీడియోలో ఆమె సెల్ఫీష్ నెస్ గురించి మాట్లాడారు.. మా అమ్మ నన్ను సెల్ఫీష్ అంటూ ఉండేది. ఆ మాట నిజమే. నాతో మంచిగా ఉండే ఫ్రెండ్స్ తో మాత్రమే నేను టచ్ లో ఉంటాను. లేనివారిని కట్ చేస్తాను. జీవితంలో ఎదగడానికి నాకు సహాయం చేయని వారికి నా లైఫ్ లో ఉండటానికిప్లేస్ లేదు. ప్రస్తుతం నేను లైఫ్ లో బాగానే సెటిల్ అయ్యాను, కానీ, అలాంటి వాళ్లు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీరు కూడా మీకు ఎదగడానికి సహకరించని వారిని లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉండనివ్వకండి.

నేను సెల్ఫిష్ నే. కానీ.. నాది హెల్తీ సెల్ఫిష్. నా జీవితం కోసం నేను సెల్ఫిష్ గా ఉన్నాను. దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది ఎఫైర్లు నడుపుతూ అదే లైఫ్ అని అనుకుంటున్నారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు గాయత్రీ. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.