నిండు కుండ‌లా హుస్సేన్ సాగ‌ర్

నిండు కుండ‌లా హుస్సేన్ సాగ‌ర్

హైద‌రాబాద్: వారం రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా 240 చదరపు కిలోమీటర్ల మేర కురుస్తున్న వర్షం అంతా కూడా సాగర్ లోకి వచ్చి చేరుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ ఎఫ్ టి ఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా…., ప్రస్తుతం 513.58 మీటర్లుగా ఉంది. దాంతో తూముని ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నారు జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు. శుక్ర‌వారం ఇన్ఫ్ ఫ్లో ఔట్ ఫ్లోలో ఐదు వందల క్యూసెక్కులు ఉండగా.. శ‌నివారం అది ఏడు వందల క్యూసెక్కులకు చేరింది. హైదరాబాద్ లో వర్షం సాధారణంగా కురుస్తుండడంతో పెద్దగా ఇబ్బందులు లేవంటున్నాయి బ‌ల్దియా వ‌ర్గాలు.