హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్టు అధికారుల్లో గందరగోళం నెలకొంది. గమనించిన అధికారులు వెంటనే రీస్టోర్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
2026 అక్టోబర్ 19న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు దుండగులు. ఐటీ టీమ్ వెంటనే గుర్తించి అకౌంట్ రికవర్ చేసినట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తులు అకౌంట్ హ్యాక్ చేసి యాక్సెస్ తీసుకున్నారు. వెంటనే గుర్తించి రీస్టోర్ చేశాం. యదావిధిగా మళ్లీ అకౌంట్ ను వినియోగించడం జరుగుతుంది. హ్యాక్ కు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తో పాటు ఎక్స్ సంస్థకు ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
ఎక్స్ అకౌంట్ ఎయిర్ పోర్ట్ ఆపరేషనల్ సిస్టంతో కలపలేదని.. దీంతో రెగ్యులర్ ఫ్లైట్ ఆపరేషన్స్, ప్యాసెంజర్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలిగే అవకాశం లేదని పేర్కొంది. దర్యాప్తు కొనసాగుతోంది.
STORY | Hyderabad airport's X account hacked, recovered quickly The official X account of the Rajiv Gandhi International Airport (RGIA) here was hacked on Monday and subsequently recovered. The IT team immediately detected the compromise, initiated measures and recovered the account, GMR Hyderabad International Airport sources said. READ: https://t.co/ppj1yCuhwa
— Press Trust of India (@PTI_News) October 19, 2026
