హైదరాబాద్ కంపెనీ..మహారాష్ట్రలో 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు..ట్రూజన్‌‌‌‌ సోలార్కు రూ.236 కోట్ల ఆర్డర్

హైదరాబాద్ కంపెనీ..మహారాష్ట్రలో 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు..ట్రూజన్‌‌‌‌ సోలార్కు రూ.236 కోట్ల ఆర్డర్

హైదరాబాద్​, వెలుగు: సోలార్​ పవర్​ తయారు చేసే హైదరాబాద్ కంపెనీ ట్రూజన్ క్లీన్ ఎనర్జీస్ సంస్థకు మహారాష్ట్రలో 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం హరిఓం పవర్ అండ్ ఎనర్జీ నుంచి రూ.236 కోట్ల విలువైన ఈపీసీ ఆర్డర్ లభించింది. పీఎం కుసుమ్ యోజన కింద హింగోలి, లాతూర్, పర్భణి, బీడ్ జిల్లాల్లో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. 

ఇందులో ఇప్పటికే 15 మెగావాట్ల పనులను ట్రూజన్ పూర్తి చేసింది. డిజైన్, ఇంజనీరింగ్, నిర్మాణం, కమిషనింగ్ వరకు అన్ని పనులను సంస్థ స్వయంగా చేపడుతుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏటా 89.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తమ నాణ్యతా ప్రమాణాలు, మెరుగైన సర్వీసు వల్లే ఈ భారీ ఆర్డర్ దక్కిందని ట్రూజన్ ఎండీ చారుగుండ్ల భవాని సురేష్  తెలిపారు.ఇప్పటి వరకు 400 మెగావాట్లకు పైగా సోలార్ ప్రాజెక్టులను, 15 వేల ఇన్‌‌‌‌స్టాలేషన్లను పూర్తి చేశామని వివరించారు.