- అమ్మా..నాన్న మీరెక్కడ ?..
- సెప్టెంబర్ 25న ట్రైన్లో తిరుమలకు..
- గంటన్నరలో చేరుకుంటామని ఫోన్తర్వాత స్విచ్ఛాఫ్
మల్కాజిగిరి, వెలుగు : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన దంపతులు కనిపించకుండా పోయారు. సెప్టెంబర్ 25 నుంచి వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ 25న రాత్రి 7.30 గంటలకు సెన్నెట్టి రాము (47), ఇతడి భార్య లక్ష్మి (44) తిరుమల దర్శనానికి వెళ్తున్నామని చెప్పి సైనిక్పురి నుంచి వెళ్లారు.
రైలులో బయలుదేరి సెప్టెంబర్ 26న తెల్లవారుజామున 3.30 గంటలకు కూతురు అఖిలతో ఫోన్లో మాట్లాడారు. మరో గంటన్నరలో తిరుమలకు చేరుకుంటామని చెప్పారు. తెల్లవారిన తర్వాత ఫోన్చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎన్నిసార్లు చేసినా అలాగే వస్తుండడంతో మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరైనా ఆచూకీ తెలిస్తే 8712662691, 8712553725, 9700166149 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
