వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ మారదు : బీసీసీఐ

వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ మారదు : బీసీసీఐ

న్యూఢిల్లీ : వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌లో మార్పు చేయాలని కోరిన హైదారాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ) విజ్ఞప్తిని బీసీసీఐ తోసిపుచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చేయలేమని సోమవారం అధికారికంగా ప్రకటించింది. ‘ఆసియా కప్‌‌‌‌ టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ తర్వాత హెచ్‌‌‌‌సీఏ ప్రతినిధులు జై షాను కలిశారు. హైదరాబాద్‌‌‌‌ పోలీసులు చెప్పిన అభ్యంతరాలను బోర్డు ముందు ఉంచారు. కానీ స్టేట్‌‌‌‌ యూనిట్‌‌‌‌ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ పట్టించుకోలేదు.

ఇక నుంచి షెడ్యూల్‌‌‌‌లో ఎలాంటి మార్పులు చేయబోమని స్పష్టం చేసింది. ఈ నెల 9న రిలీజ్‌‌‌‌ చేసిన రివైజ్డ్‌‌‌‌ షెడ్యూలే చివరిది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌‌‌‌ 10, 11న హైదరాబాద్‌‌‌‌లో వరుసగా మ్యాచ్‌‌‌‌లు ఉండటంతో భద్రత కల్పించడం కష్టమవుతుందని పోలీసులు హెచ్‌‌‌‌సీఏ దృష్టికి తీసుకెళ్లారు.