స్టార్టప్‌‌‌‌లకు అడ్డాగా హైదరాబాద్‌‌‌‌.. సెప్టెంబర్ 19న గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్!

స్టార్టప్‌‌‌‌లకు అడ్డాగా హైదరాబాద్‌‌‌‌.. సెప్టెంబర్ 19న గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్!

స్టార్టప్‌‌లకు కొత్త ఊపునివ్వాలనే లక్ష్యంతో గ్లోబల్ స్టార్టప్స్ క్లబ్ హైదరాబాద్‌‌ను వేదికగా ఎంచుకుంది. రాబోయే గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్ 2026లో యువ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు, వ్యాపారవేత్తలు ఒకే చోట చేరి ఆలోచనలను పంచుకోనున్నారు. నిధుల సమీకరణ నుంచి మార్గదర్శకత్వం, పెట్టుబడిదారులతో నేరుగా అనుసంధానం వరకు కొత్త తరం స్టార్టప్‌‌లకు ఈ సమ్మిట్ ఒక అరుదైన అవకాశంగా నిలవనుంది. 

స్టార్టప్ స్టార్ట్​ చేయాలనుకునేవాళ్లను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గ్లోబల్ స్టార్టప్స్ క్లబ్ వచ్చే నెలలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్లోబల్ స్టార్టప్ సమ్మిట్ 2026ను నిర్వహించనుంది. భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌‌‌‌ను బలోపేతం చేయడంతో పాటు, కొత్త వ్యవస్థాపకులకు నిధుల సమీకరణ, మార్గదర్శకత్వం, పెట్టుబడిదారులతో అనుసంధానం వంటి అవకాశాలను కల్పించడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశ్యం. 

సెప్టెంబర్19న హైటెక్ సిటీలోని దక్కన్ సెరై హోటల్‌‌‌‌లో జరగనున్న ఈ సమ్మిట్‌‌‌‌లో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఒకే వేదికపై కలుసుకోనున్నారు. తమ వ్యాపార ఆలోచనలను ప్రదర్శించేందుకు, స్టార్టప్‌‌‌‌లను ప్రచారం చేసుకునేందుకు, పెట్టుబడిదారులకు ఎలివేటర్ పిచ్‌‌‌‌లు ఇవ్వడానికి, నిధులు సమీకరించుకునేందుకు ఇది అరుదైన అవకాశమని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్ సిటీలో ఆగస్టు 2026లో హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎక్స్‌‌‌‌పో, హిప్లెక్స్ 2026, క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో వంటి ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎక్స్‌‌‌‌పో 2026 - ఆగస్టు 8 – 9 తేదీల్లో ఇషితా కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో జరగనుంది. బ్రాండ్లు, వ్యాపార పెట్టుబడిదారులను అనుసంధానించే వేదిక కానుంది. హిప్లెక్స్ 2026 ఆగస్టు 7–10 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌లో జరగనుంది. హింటెక్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్స్‌‌‌‌పో ఇండియా ఆగస్టు​ 20 –24 తేదీల్లో హైటెక్స్‌‌‌‌లో చేపట్టనున్నారు. ఈ ఎక్స్​పోలో యంత్రాలు, ఇంజనీరింగ్, క్రీడా రంగ ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుంది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026 -ఆగస్టు 28– 30 తేదీల్లో హైటెక్స్‌‌‌‌లో చేపట్టనున్నారు. ఈ షోలో రెరా ఆమోదం పొందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ప్రదర్శన ఉంటుంది.

అగ్రశ్రేణి ఆవిష్కర్తలు.. 

హైదరాబాద్‌‌‌‌లో స్టార్టప్ కమ్యూనిటీ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇంక్యుబేటర్ల మద్దతుతో ఇది టెక్ హబ్‌‌‌‌గా మారింది. స్కైరూట్ ఏరోస్పేస్ మనదేశంలో తొలిసారిగా ప్రైవేట్‌‌గా అభివృద్ధి చేసిన రాకెట్‌‌ను ప్రయోగించి గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక సంస్థ. జెనోటి బ్యూటీ.. వెల్​నెస్, ఫిట్‌‌నెస్ రంగాలకు క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌‌వేర్ సేవలు అందించే సంస్థ. ధ్రువ స్పేస్.. ఉపగ్రహాల రూపకల్పన, తయారీ, ప్రయోగ సేవలను అందించే సమగ్ర అంతరిక్ష ఇంజినీరింగ్ సంస్థ. కేకా హెచ్ఆర్.. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం రూపొందించిన ఉద్యోగి- కేంద్రీకృత మానవ వనరుల నిర్వహణ, పేరోల్ ప్లాట్​ఫాం.

టీ - హబ్.. స్టార్టప్‌‌‌‌లకు అండ

హైదరాబాద్‌‌‌‌లోని టీ-హబ్ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ మద్దతు ఉన్న స్టార్టప్ ఇంక్యుబేటర్‌‌‌‌గా గుర్తింపు పొందింది. వందలాది మెంటార్లు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌‌‌‌లకు ఇది వారధిగా నిలుస్తోంది. ఐఎస్‌‌‌‌బీ, నల్సార్ వంటి ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో నడుస్తున్న టీ- హబ్ సుమారు 5.72 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తోంది. హైదరాబాద్‌‌‌‌లోని ఐటీ, డీప్‌‌‌‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల అభివృద్ధికి టీ- హబ్ కీలక కేంద్రంగా మారింది. కొత్త ఆలోచనలను వ్యాపారాలుగా మలచాలనుకునే వారికి మార్గనిర్దేశం, పెట్టుబడులు, పరిశ్రమలతో అనుసంధానం వంటి సేవలను అందిస్తూ స్టార్టప్‌‌‌‌ల ఎదుగుదలకు బలమైన వేదికగా నిలుస్తోంది.