ఉరుకులు పరుగుల జీవితంలో నిత్యం పనుల ఒత్తిడికి గురైన హైదరాబాద్ నగర వాసులు వీకెండ్స్ లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు నగర శివార్లలోని ఫాం హౌస్‌లు, రిసార్ట్‌లకు తరలి వస్తున్నారు. వీకెండ్ రీట్రిట్స్, కిట్టీ పార్టీలు, బ్యాచ్‌లర్ పార్టీలు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్, వీకెండ్ ఎస్కేప్స్, ఫెస్టివ్ సెలబ్రేషన్స్, బర్త్ డే పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్స్.. ఇలా వేడుక ఏదైనా పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా జరుపుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఫాంహౌస్‌లంటే సెలబ్రిటీలు, ధనవంతులకే పరిమితం. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్లు కూడా తమ బడ్జెట్‌కు అనుగుణంగా వీటిని రెంట్‌కు తీసుకుంటున్నారు.
ఫాంహౌస్‌లు, రిసార్ట్‌ల్లో రకరకాల వేడుకలు జరుపుకునేందుకు అవసమైన ఏర్పాట్లు చేస్తున్నారు వాటి యజమానులు. ఏసీ బెడ్రూంలు, అటాచ్డ్ బాత్ రూంలు, గెస్టుల కోసం అవుట్ డోర్ బాత్ రూంలు, హాట్ వాటర్ గీజర్స్, 20 మంది ఒకేసారి భోజనం చేసేలా డైనింగ్ ఏరియా, ప్రైవేటు స్విమ్మింగ్ పూల్, కిచెన్, రిఫ్రిజిరేటర్,150 మంది పట్టేలా సెలబ్రేషన్స్ కోసం గ్రీన్ లాన్, గార్డెన్ ఏరియా, పార్కింగ్ ప్లేస్, ప్రొజెక్టర్, సాయంత్రాలు బోనఫైర్ సెటప్, క్యారమ్స్, చెస్, కార్డ్స్ లాంటి ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, స్మార్ట్ టీవీ, బార్బెక్యూ, పూల్ వాలీబాల్, గెస్ట్ లాంజ్, మ్యూజిక్ సిస్టమ్, పూల్ వ్యూ ఉన్న బెడ్‌రూమ్‌లు, మైక్రోవేవ్, ఎయిర్ కూలర్లు, క్రికెట్ కిట్, బ్యాడ్మింటన్ సెట్ లాంటి అవుట్ డోర్ గేమ్స్ సౌకర్యాలు, ఫంక్షన్లు, వైఫై విత్ ఫుల్ కవరేజి, సీసీటీవీ సెక్యూరిటీ కెమెరాలు, కేర్ టేకర్, పవర్ బ్యాకప్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివన్నీ అందుబాటులో ఉంచారు. సౌకర్యాలను బట్టి రోజుకు రూ.5 వేల నుంచి రూ. 2 లక్షల దాకా చార్జ్ చేస్తున్నారు.
ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
హైదరాబాద్ నగర శివార్లలోని నలుమూలల ఉన్న ప్రాంతాల్లో ఈ ఫాం హౌస్‌లు, వీకెండ్ హోమ్స్ ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, శ్రీశైలం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నాగార్జునసాగర్ హైవేలు, శంషాబాద్ విమానాశ్రయం, గండిపేట జలాశయం వైపు ఫాం హౌస్‌లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. గతంలో ఫాం హౌస్ యజమాని తన కుటుంబంతో వారాంతాల్లో సేదతీరేందుకు నిర్మించుకున్నారు. కానీ నగరం విస్తరించడంతో ఫాంహౌస్‌లను అద్దెకు ఇస్తున్నారు.
మొయినాబాద్, శంకరపల్లి, కీసర, కోకాపేట, కందుకూరు, విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు, గచ్చిబౌలి, శామీర్ పేట, ఘట్ కేసర్, నాగార్జునసాగర్ రోడ్డు, ఇబ్రహీంపట్నం, గండిపేట, పటాన్ చెరు, అజీజ్ నగర్ ఇలా చాలా ఏరియాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. నగర శివార్లలోని ఫాం హౌస్‌లకు వెళ్లేందుకు ఓలా, ఊబర్, రాపిడో సౌకర్యాలు వాడుకోవచ్చు.
వీటితో పాటు ఫాం హౌస్‌లకు వెళ్లాక పాపులర్ రెస్టారెంట్లు, దాబాల నుంచి జొమాటో, స్విగ్గి డెలివరీ ద్వారా ఇష్టమైన ఆహారం, తినుబండారాలను తెప్పించుకోవచ్చు. కొన్ని ఫాం హౌస్‌లలో అయితే పార్టీకి వచ్చే అతిథులకు అక్కడే వంట చేయించి వడ్డిస్తున్నారు. దీనికోసం చెఫ్‌లు కూడా అందుబాటులో ఉంటారు.అందుకే ఈ కల్చర్ సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంటోంది.
రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..
ఫ్యామిలీ పార్టీల్లో పాల్గొనే వారి కోసం రూల్స్ ఉంటాయి. ఫ్యామిలీ పార్టీకి ఫాంహౌస్ బుకింగ్‌కి ఐడీ ఫ్రూఫ్ తప్పనిసరి. ఫాంహౌస్ యజమానులు లేదా నిర్వాహకులు పార్టీ పెట్టుకున్న వారి పాస్ పోర్ట్ లేదా ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ప్రభుత్వ ఐడీలు, లోకల్ ఐడీల జిరాక్స్ కాపీలు సమర్పించాల్సిందే.డ్రగ్స్, గంజాయి, హుక్కాలాంటివి ఫాం హౌస్‌లలో అనుమతించరు. ఫాం హౌస్ పార్టీలకు వచ్చే అతిథులందరికీ చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం అవసరం.
ఈ వీకెండ్ హోమ్స్‌లో చెక్ -ఇన్, చెక్- అవుట్ సమయాలను నిర్దేశించారు. బుక్ చేసుకున్న అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రాపర్టీలోని వస్తువులకు ఏదైనా జరిగితే ఫైన్ వేస్తారు. అనుమతించిన సమయం వరకు మాత్రమే పెద్ద శబ్దంతో సంగీతం పెట్టుకోవచ్చు. ముందస్తు అనుమతితో మాత్రమే పెంపుడు జంతువులను తీసుకెళ్లొచ్చు. వాహనాలను కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే పార్క్ చేయాలి.
వీకెండ్ హోమ్స్..
ప్రకృతి ఒడిలో వీకెండ్ హోమ్స్‌కు వరల్డ్ ఫేమస్, ఎకో ఫ్రెండ్లీ లగ్జరీ ప్రగతి రిసార్ట్స్ అండ్ గ్రీన్ మెడోస్. గ్రీన్ హావెన్ స్పోర్ట్స్ విల్లా హైదరాబాద్ దగ్గర్లో వీకెండ్ విహారయాత్ర కోసం క్రీడా సౌకర్యాలతో ఉన్న బెస్ట్ ఫామ్. సెలవులను ఆస్వాదించాలనుకునే వారికోసం మృగవని నేషనల్ పార్క్ మంచి చాయిస్. వీకెండ్, వీక్‌డే ధరల్లో తేడా ఉంటుంది. కుటుంబంతో గడపడానికి ఫాంహౌస్‌లు ఎంతో అనుకూలంగా ఉన్నాయని బాలినేని వీరయ్య చెప్పారు.
తూంకుంట గ్రామంలో ఉన్న సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్, కేకే ప్యాలెస్, వేదిక రిసార్టు, గోల్డ్ ఫించ్ ఫాంహౌస్, దక్ష్య, వనం ఫార్మ్ స్టే, ట్రాంక్విల్ ఎడ్జ్ ఫార్మ్‌హౌస్ , హరివిల్లు ఫార్మ్‌హౌస్, ది జెస్ట్ ఫార్మ్ హౌస్, సన్నీ క్లిఫ్ వారాంతపు విహారయాత్రకు అనువుగా ఉన్నాయి. కొన్ని ఫాం హౌస్లైతే అతిథులకు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి. వీకెండ్స్‌లో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుందని మనశ్శాంతి ఫాం హౌస్ యజమాని అత్తోట మురళీ ముకుంద్ చెప్పారు.
ఫ్యామిలీ పార్టీలకు..
వీకెండ్ హౌస్‌లుగా పిలిచే ఈ ఫాం హౌస్‌లు ఫ్యామిలీ పార్టీలకు వేదికలుగా మారాయి. గోల్డ్ ఫించ్ ఫార్మ్ హౌస్, హరివిల్లు ఫాంహౌస్, కేకే ప్యాలెస్, వేదిక రిసార్ట్, దక్ష్యా వనం ఫాం స్టే,
ద జెస్ట్ ఫాంహౌస్, టాంక్విల్ ఎడ్జ్ ఫాం హౌస్, స్క్వేర్ ఫాం రీట్రిట్, ఉత్సవ్ ఫాంహౌస్, రెడ్డి ఫాంహౌస్, శ్రీ అవధూత ఫాంహౌస్, డ్రీమ్ లాండ్ ఫాం హౌస్, సన్నీ క్లిఫ్ ఫాంహౌస్, ట్రాంక్విల్ పికోలా, మూన్ లైట్ మెడోస్ బాక్స్ క్రికెట్, నేచర్ రిట్రీట్ కన్వెన్షన్, విష్రం ఫాంహౌస్, ద నేచర్ ఎలిగేన్స్, జడ్ ఏ నేచర్ విల్లా, బ్రేక్ స్పాట్ విల్లా, ఒపెన్ ఫీల్డ్ విల్లాలు వివిధ రకాల పార్టీలు, ఫంక్షన్లతో మెరిసిపోతున్నాయి.
