ఇవాళ (అక్టోబర్ 23) దక్షిణాది రాష్ట్రాల డీజీపీల భేటీ

ఇవాళ (అక్టోబర్ 23) దక్షిణాది రాష్ట్రాల డీజీపీల భేటీ
  •     ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు
  •     ఉగ్రవాదం, డ్రగ్స్, సైబర్ నేరాలపై చర్చ
  •     అంతర్రాష్ట్ర నేరాల కట్టడికి ఉమ్మడి కార్యాచరణ

హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది. అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణ, పోలీసు శాఖల మధ్య సమన్వయమే లక్ష్యంగా శుక్రవారం బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో డీజీపీలు, ఐజీపీలు భేటీ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్ల పోలీసు ఉన్నతాధికారులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, డీఆర్ఐ, ఎన్ఐఏ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొననున్నారు. 

ఉత్తమ పోలీసింగ్ విధానాలు, సమాచార మార్పిడి, అంతర్రాష్ట్ర నేరాల కట్టడికి ఉమ్మడి కార్యాచరణపై చర్చించనున్నారు. ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాల ప్రస్తుత పరిస్థితులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్, వ్యవస్థీకృత, ఆర్థిక నేరాలు, యువత ఆందోళనలు, నిరసనలు, మానవ అక్రమ రవాణా ఎజెండాలో ఉన్నాయి. అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాల కదలికలు, దర్యాప్తు సమస్యలు, పోలీసు శాఖల సమన్వయంతో పాటు సముద్ర తీర భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, పోలీసింగ్లో ఏఐ వినియోగంపైనా సమీక్షించనున్నారు.