చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్

చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్

మైనర్ బాలికల పై లైంగిక వేధింపులు ఆగడం లేదు. నెలకో చోట మైనర్ బాలిక పై అత్యాచారం వంటి కేసులు వస్తున్నాయి.   లైంగిక వేధింపులకు పాల్పడి హైదరాబాద్ కు చెందిన మైనర్ బాలికపై గర్భం దాల్చింది. ఈ కేసులో నింధితుడిని హైదరాబాద్ నగర పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేటలో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ అనే నిందితుడు పటాన్‌చెరుకు చెందిన 16 ఏళ్ల యువతితో సోషల్‌ మీడియా ద్వారా స్నేహం చేశాడు. 

ప్రేమిస్తున్నా అని మాయమాటలు చెప్పి కొన్ని నెలల క్రితం ఆమెను ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొన్ని రోజుల క్రితం బాలిక తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఆసుపత్రిలో బాలిక గర్భవతి అని తేలింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై అపహరణ, అత్యాచారం, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలిక ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతోంది. నవీన్‌ను కోర్టు ముందు హాజరుపరిచి, తదనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.