చైన్​ స్నాచింగ్ చేస్తున్న డ్యాన్సర్లు అరెస్ట్

చైన్​ స్నాచింగ్ చేస్తున్న డ్యాన్సర్లు అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు : ఈజీ మనీ కోసం ఒంటరి మహిళలను టార్గెట్‌‌ చేసి, చైన్ స్నాచింగ్‌‌కు పాల్పడుతున్న ఇద్దరు డ్యాన్సర్లను సౌత్‌‌ఈస్ట్‌‌ జోన్ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 9.9 గ్రాముల గోల్డ్‌‌ చైన్, బైక్, సెల్‌‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ రష్మీ పెరుమాల్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మన్నెగూడకు చెందిన గరల ప్రసాద్ గౌడ్(24), బాలాపూర్ మల్లాపూర్‌‌‌‌కు చెందిన వద్యవత్‌‌ గణేశ్(21) ఈవెంట్స్ లో డ్యాన్సర్లుగా పనిచేస్తున్నారు.

గణేశ్ ర్యాపిడో డైవర్‌‌‌‌కూడా. వీరిద్దరూ చెడు వ్యసనాలకు బానిసలై, ఈజీ మనీ కోసం చోరీలు ప్లాన్ చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్‌‌ చేసి చైన్​స్నాచింగ్​లకు పాల్పడుతున్నారు. ఈ నెల16న రాత్రి 7.30 గంటల సమయంలో ఐఎస్‌‌సదన్‌‌లో ఓ మహిళ మెడలోని గోల్డ్​చైన్​గుంజుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, నిందితుల బైక్‌‌ను గుర్తించారు. శనివారం ప్రసాద్ గౌడ్‌‌, గణేశ్​ను అరెస్ట్ చేశారు.