సతీమణితో కలిసి కేక్ కట్ చేసిన హైదరాబాద్ పోలిస్ కమిషనర్ సీవీ ఆనంద్

 సతీమణితో కలిసి కేక్ కట్ చేసిన హైదరాబాద్ పోలిస్ కమిషనర్ సీవీ ఆనంద్

నూతన సంవత్సరం పురస్కరించుకొని ట్యాంక్ బండ్  పై  హైదరాబాద్ పోలిస్ కమిషనర్ సీవీ ఆనంద్ సతీమణితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డీసీపీలు, ఏసీపీలు పోలీస్ సిబ్బందితో పాటు పోలిసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. 

ఏడాది క్రితం తాను ఛార్జ్ తీసుకొని శాంతి భద్రతలపై పెద్ద పీట వేశామని సీపీ ఆనంద్ చెప్పారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అందరూ ఎంజాయ్ చేయండని అన్నారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలుకు, గొడవలకు తావు లేకుండా చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. మీరు అనుకున్న లక్ష్యాలను ఈ ఏడాది సాధించాలని కోరుతున్నానన్నారు.

ఇక ఎల్బీ నగర్, మాదాపూర్ లోనూ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అందులో భాగంగా ఎల్బీ నగర్ లోని శ్రీకాంత చారి విగ్రహం వద్ద రాచకొండ సీపీ చౌహన్ కేక్ కట్ చేశారు.

మాదాపూర్ టీ హబ్ వద్ద సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కేక్ కట్ చేసి,  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.