హైదరాబాద్ లో తాగి బండ్లు నడిపేటోళ్లు ఇంతమంది ఉన్నారా.. వారం రోజుల్లో 928 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..

హైదరాబాద్ లో తాగి బండ్లు నడిపేటోళ్లు ఇంతమంది ఉన్నారా.. వారం రోజుల్లో 928 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..

హైదరాబాద్ లో ఉండే ఎక్కువ మంది బ్యాచిలర్లు, కార్పొరేట్ ఎంప్లాయిస్ లో చాలా మందికి రాత్రుళ్ళు రోడ్లు పట్టుకు తిరిగే అలవాటు ఉంటుంది. వీరిలో చాలా మంది మందు తాగి రోడ్లపై తిరుగుతుంటారు. దీనికి నైట్ లైఫ్ అని పేరొకటి పెట్టి సమర్థించుకుంటుంటారు. వీకెండ్ వచ్చిందంటే ఇక చెప్పాల్సిన పని లేదు. తాగి బండ్లు నడిపేటోళ్ల వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవ్వడమే కాకుండా యాక్సిడెంట్లు కూడా అవుతాయి. హైదరాబాద్ పోలీసులు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లు నిర్వహిస్తూ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తాగి బండ్లు నడిపేటోళ్లు ఏ మాత్రం తగ్గటం లేదు. జూన్ 7 నుంచి 13 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో వారం రోజుల్లో 928 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోండి జనం ఏ రేంజ్ లో తాగి రోడ్లపై పడుతున్నారో.

స్పెషల్ డ్రైవ్ లో మద్యం సేవించి వాహనం నడిపినందుకు 928 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. వీరిలో చాలా మంది తాగి బైక్ నడుపుతూ పట్టుబడ్డవారే ఉన్నట్లు తెలిపారు పోలీసులు. పట్టుబడ్డవారిలో 805 మంది బైక్ రైడర్స్ ఉన్నట్లు తెలిపారు పోలీసులు. వీరిలో 209 మంది డ్రైవర్ల రక్తంలో ఆల్కహాల్ సాంద్రత 30mg/100ml, 50mg/100ml మధ్య ఉన్నట్లు తెలిపారు పోలీసులు.13 మందికి ఆల్కహాల్ శాతం చాలా ఎక్కువ ఉన్నట్లు తెలిపారు... 

BAC స్థాయి ఆధారంగా కేసుల సంఖ్య:

  • 30–50 mg/dL: 209 కేసులు
  • 51–100 mg/dL: 419 కేసులు
  • 101–150 mg/dL: 175 కేసులు
  • 151–200 mg/dL: 71 కేసులు
  • 201–250 mg/dL: 28 కేసులు
  • 251–300 mg/dL: 13 కేసులు
  • 300 mg/dL పైన: 13 కేసులు

పట్టుబడ్డవారిలో మైనర్లు ఎవరు లేరని తెలిపారు పోలీసులు. కేసు నమోదైనవారికి జరిమానా లేదా జైలు శిక్ష, లేదా రెండింటినీ విధిస్తామని తెలిపారు పోలీసులు. చట్టం ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ళ జైలు శిక్ష, జరిమానా ఉంటుందని తెలిపారు పోలీసులు.