హమారా హైదరాబాద్ ర్యాప్ సాంగ్తో స్టాండప్ కిక్కు.. ఊపేస్తున్న స్ట్రీట్ సెలబ్రిటీ

హమారా హైదరాబాద్ ర్యాప్ సాంగ్తో స్టాండప్ కిక్కు.. ఊపేస్తున్న స్ట్రీట్ సెలబ్రిటీ

హైదరాబాద్ స్ట్రీట్ సెలబ్రిటీ ర్యాపర్ కేదెన్‌శర్మ(Kayden Sharma) ఎంటీవీ హస్టిల్ సీజన్-3(MTV Hustle season3)లో అదరగొట్టేశాడు. తన పాటతో ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు. అతడి పర్ఫార్మెన్స్ కు జడ్జెస్ సైతం అవాక్కయ్యారు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ ర్యాపర్ మ్యూజికల్ మ్యాజిక్ కు షోకు వచ్చిన ప్రేక్షకులు శివాలెత్తిపోయారు. 

హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ.. అంటూ స్టేజీపై మెస్మరైజ్ చేశాడు కేదెన్‌శర్మ. హైదరాబాద్ కల్చర్‌ను, నగర గొప్పతనాన్ని తన ర్యాప్‌లో చెబుతుంటే జనమంతా ఊగిపోయారు. యువత కేరింతలతో రచ్చ రచ్చ చేశారు. హలో మేడమ్ ఇదర్ మిల్తా డిస్కౌంట్, రియాల్టీ చెక్ మిల్తా హర్ దూస్రీ గల్లీమే.. అని పాడుతుంటే ఒక్కొక్కరు స్టన్ అయ్యారు. ఇక ప్రముఖ సింగర్ బాద్షా అయితే పేపర్స్ చింపి గాల్లో ఎగరేసి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

దీనికి సంబందించిన వీడియోను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తన ఖాతాలో షేర్ చేయగా అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కేదెన్‌శర్మపై ప్రశసంలు కురిపిస్తున్నారు. గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకు అభిమానులుగా మారిపోతున్నారు. వీలుంటే మీరు కూడా ఓ లుక్కేయండి.