26 శాతం యువతకు ఆరోగ్య బీమా..హైదరాబాదీలకు ఆరోగ్యంపై తగినంత అవగాహన

26 శాతం యువతకు ఆరోగ్య బీమా..హైదరాబాదీలకు ఆరోగ్యంపై తగినంత అవగాహన

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ యువత ఆరోగ్య సంరక్షణ విషయంలో ముందంజలో ఉన్నారని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ రిపోర్ట్​ వెల్లడించింది. దీని ప్రకారం.. ఆరోగ్య సంసిద్ధత స్కోరులో జాతీయ సగటు 4.54 కాగా, హైదరాబాద్ యువత 5.13 స్కోరు సాధించింది. నగర యువతలో 26 శాతం మందికి వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నాయి. బీమా పథకాల కోసం ఆదాయంలో 18 శాతం కేటాయిస్తున్నారు. 

అయితే వైద్య ఖర్చులను అంచనా వేయడంలో పొరబడుతున్నారు. అత్యవసర వైద్య పరిస్థితికి కేవలం రూ.24 వేలు సరిపోతాయని పొరబడుతున్నారు. నిజానికి రూ.లక్షలు ఖర్చు అవుతుంది. వైద్య ఖర్చుల గురించి మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య బీమా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, ఆర్థిక భద్రతపై కచ్చితమైన ప్రణాళికలు అవసరమని ఈ రిపోర్ట్​  సూచించింది.