హైపోథైరాయిడిజం నుంచి బయటపడాలంటే ఇవి తినకండి..

హైపోథైరాయిడిజం నుంచి బయటపడాలంటే ఇవి తినకండి..

థైరాయిడ్.. మన శరీరంలోని ఒక చిన్న గ్రంథి..ఇది వివిధ శరీర విధుల కోసం హార్మోన్లను విడుదల చేస్తుంది. హైపోథైరాయిడిజం అంటే తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిచేయని పరిస్థితి. దీనిని అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు. 

హైపోథైరాయిడిజం..బరువు పెరగడం, అలసట, మలబద్ధకం, డిప్రెషన్, పొడి చర్మం, నెమ్మదిగా హృదయ స్పందన రేటు, కండరాల బలహీనత, జుట్టు పల్చబడటం, నెమ్మదిగా గుండె కొట్టుకోవడం, కీళ్లలో దృఢత్వం హైపోథైరాయిడిజం కొన్ని లక్షణాలు. హైపోథైరాయిడ్ పరిస్థితిని నిర్వహించడంలో మీ ఆహారం,  జీవనశైలి కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ఆహారాలు హైపోథైరాయిడ్ ను మరింత తీవ్రతరం చేస్తాయి. వీటిని ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ఉంది. 

హైపో థైరాయిడిజంతో బాధపడే వ్యక్తులు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. హైపోథైరాయిడిజం అనేక ప్రమాదకరమైన వ్యాధులకు కారణంగా కావచ్చు. హైపోథైరాయిడిజం సమర్థవంతంా నిర్వహించాలంటే.. ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. హైపోథైరాయిడిజం కంట్రోల్ చేయాలంటే.. తినకూడని పదార్థాలు.. 

1. క్రూసిఫరస్ కూరగాయలు

క్రూసిఫరస్ కూరగాయలు  అనగా కాలే, బ్రోకలీ, కాలీఫ్లవర్, టర్నిప్, క్యాబేజీ మరియు బచ్చలికూర వంటి ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ.. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలిగించే గోయిట్రోజెన్‌లను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని మీ రోజువారీ ఆహారంలో తగ్గించండి. ఒకవేళ తినాలకుంటే మితంగా తినండి. 

2. సోయా ఆహారాలు

సోయాలో ఈస్ట్రోజెన్ ,ఐసోఫ్లేవోన్‌లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్‌ను ఉపయోగించుకునే శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి థైరాయిడ్ తక్కువగా ఉన్నవారు సోయాను తినడం మానేయాలి. 

3. మిల్లెట్స్

"మిల్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్ అపిజెనిన్, థైరాయిడ్ పెరాక్సిడేస్.. థైరాయిడ్ హార్మోన్‌లోకి అయోడిన్‌ను చొప్పించే ఎంజైమ్ కార్యాచరణను తగ్గిస్తుంది..అందుకే మిల్లెట్స్ కూడా మితంగా తినాలి. 

4. కెఫిన్

థైరాయిడ్ మందులు తీసుకుంటే మీరు సరైన సమయంలో కెఫిన్ తీసుకోవాలి. మీరు థైరాయిడ్ కోసం మందులు తీసుకున్న తర్వాత కెఫిన్ తీసుకుంటే అది మందులపై పనితీరుపై ప్రభావం చూపుతుంది.

5. మద్యం

ఆల్కహాల్ అనేక విధాలుగా శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే, గ్రహించే శరీర సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్న వారు పైన తెలిపిన ఆహార పదార్థాలు తినకుండా ఉండటం కానీ, మితంగా తింటే కంట్రోల్ ఉంటుందని న్యూట్రిషన్లు చెబుతున్నారు.